Puneeth Rajkumar: ‘నీవు లేవని.. ఇక రావని’.. పునీత్ చివరి సినిమా చూస్తూ కన్నీటి పర్యంతమైన ఫ్యాన్స్.
Puneeth Rajkumar Birthday: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడన్న నిజాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో అకాల మరణం పొందిన అప్పు ఇక లేడన్న వార్తను నమ్మలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు 5 నెలలు..
Puneeth Rajkumar Birthday: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడన్న నిజాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో అకాల మరణం పొందిన అప్పు ఇక లేడన్న వార్తను నమ్మలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు 5 నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన హీరోగా నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ను విడుదల చేశారు. ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా ఈ సినిమా హడావుడి నడుస్తోంది. తమ అభిమాన హీరో చివరి సినిమాను చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున పేపర్లు జల్లుతూ, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. స్క్రీన్‌పై కనిపిస్తున్న పునీత్, నిజం జీవితంలో లేడని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బరువెక్కిన గుండెలతో సినిమాను వీక్షిస్తున్నారు.
Fans getting emotional seeing after #James movie?
Every fan is crying coming out of theatre seeing movie?#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8
— Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022
గుండె లోతుల్లో దాగి ఉన్న బాధ కట్టలు తెంచుకొని కన్నీటి రూపంలో బయటకు వస్తోంది. ఫ్యాన్స్ ఎమోషన్‌కు గురైన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బరువెక్కిన హృదయాలతో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు పునీత్ ఫ్యాన్స్. ఇక ఈ వీడియోలు చూసిన ఆయన ఫ్యాన్స్ పునీత్‌ను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Viral Video: ఇన్‌స్టా రీల్ చేద్దామనుకున్నాడు.. కానీ.. పెంపుడు కుక్క దెబ్బకు ఫ్యూజులౌట్..
ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.