AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇన్‏స్టా రీల్ చేద్దామనుకున్నాడు.. కానీ.. పెంపుడు కుక్క దెబ్బకు ఫ్యూజులౌట్..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటలు గంటలు నెట్టింట్లో మునిగి తేలుతున్నారు.

Viral Video: ఇన్‏స్టా రీల్ చేద్దామనుకున్నాడు.. కానీ.. పెంపుడు కుక్క దెబ్బకు ఫ్యూజులౌట్..
Video
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2022 | 1:41 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటలు గంటలు నెట్టింట్లో మునిగి తేలుతున్నారు. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్సులు.. పాటలు పాడడటమే కాకుండా.. లైక్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రై చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు రీల్స్ చేద్దామనుకున్నప్పుడు ఊహించని షాక్స్ తగులుతుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని మాత్రం అయ్యో పాప అనిపిస్తాయి. కానీ వీడియో చూస్తే మాత్రం మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఓ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా రీల్ చేద్దామనుకున్నాడు. అందుకోసం ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఓచోట ఫోన్ పెట్టి డ్యాన్స్ చేయాలనుకున్నాడు. అయితే ఫిక్స్ చేసి వెనకకు పరిగెత్తేలోపు.. అతనితోపాటే పెంపుడు కుక్క సైతం పరిగెడుతుంది. దీంతో ఆ పెంపుడు కుక్క కాళ్లలో తట్టుకోవడంతో ఠక్కున కిందపడిపోతాడు. దెబ్బకు మోకాళ్ల చిప్పలు పగిలిపోయాయనుకోండి.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. ఇందులో ఆ పెంపుడు కుక్క తప్పు లేదని.. దానిని కొట్టవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..

Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..

Ashoka Vanamlo Arjuna Kalyanam: “అశోకవనంలో అర్జున కళ్యాణం” రిలీజ్ అయ్యేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..