Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..

అభిమానానికి హద్దులుండవు.. తమకు ఇష్టమైనవారి కోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి సిద్ధపడిపోతారు.. అలాగే ఇష్టమైన వ్యక్తులపై అభిమానాన్ని

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..
Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2022 | 8:03 AM

అభిమానానికి హద్దులుండవు.. తమకు ఇష్టమైనవారి కోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి సిద్ధపడిపోతారు.. అలాగే ఇష్టమైన వ్యక్తులపై అభిమానాన్ని అనేక రకాలుగా చాటిచెప్తారు చాలామంది. గాజు సీసాలో చిత్రపటాలు.. బియ్యం గింజలపై.. ఆకులపై తమకు ఇష్టమైన వారి రూపాన్ని తీర్చిదిద్దుతారు.  (Sukumar)అంతేకాకుండా.. తమకు ఇష్టమైన వారిపేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే అభిమానాన్ని చాటడంలో కొన్ని మాత్రం నెవ్వర్‌ బిఫోర్‌, ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అన్నట్టు ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పబోయే విషయం.

నార్మల్‌గా హీరోకు ఫ్యాన్స్‌ ఉంటారు. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్‌ ఉంటారు. రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. కానీ దర్శకుడికి, ఒక హీరో అభిమాని అయితే, ఆ అభిమానం చూపించే తీరు ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి తాజాగా ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్​పై ఓ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. దూరదర్శిని చిత్రంలో కథానాయకుడిగా నటించిన సువీక్షిత్ బొజ్జా, సుకుమార్​కు వీరాభిమాని. ఇటీవల పుష్ప చిత్రంతో దేశం గర్వించదిగిన దర్శకుల్లో ఒకరిని నిలిచిన సుకుమార్​పై ప్రేమతో, తన అభిమానాన్ని చాటుకునేందుకు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సువీక్షిత్.

Sukku

తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బోరెడ్డిగారి గ్రామంలో, రెండున్నర ఎకరాల భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా సాగు చేశారు హీరో. దాదాపు 50 రోజులపాటు శ్రమించి ఆ రూపాన్ని తీసుకొచ్చారు. సుకుమార్ తోపాటు పుష్ప-2 పేరు కూడా సాగు చేయడం మరింత ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించి వీడియోను దర్శకుడు సుకుమార్​కు చూపించి తన అభిమానాన్ని చాటుకున్నారు సువీక్షిత్. అయితే, తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసి నివ్వెరబోయారు సుకుమార్‌. నోట మాట రావడం లేదని, కళ్లు చెమర్చాయని చెప్పారు టాప్‌ డైరెక్టర్. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? అంటూ సువీక్షిత్‌ని అభినందించారు. ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు సుకుమార్. సువీక్షిత్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను చూసిన సుకుమార్ ఫ్యాన్స్‌, ఆనందంలో మునిగితేలుతున్నారు.

Also Read: The Kashmir Files: సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా…?

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌కు జోడిగా..?

Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే

RRR Movie: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్‌ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..