AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌కు జోడిగా..?

Krithi Shetty: ఉప్పెన (Uppena) సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. మొదటి సినిమాతో తెలుగు కుర్రకారుల మనస్సులను కొల్లగొట్టిన ఈ చిన్నది వరుస అవకాశలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో..

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌కు జోడిగా..?
Krithy Shettty
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2022 | 7:56 PM

Krithi Shetty: ఉప్పెన (Uppena) సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. మొదటి సినిమాతో తెలుగు కుర్రకారుల మనస్సులను కొల్లగొట్టిన ఈ చిన్నది వరుస అవకాశలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే నానితో ‘శ్యామ్ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో కృతి లక్కీ హీరోయిన్‌గా కూడా పేరు దక్కించుకుంది. ఇదే జోష్‌లో మరో మూడు సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిందీ బ్యూటీ.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్‌’, ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తోన్న సమాచారం కృతిశెట్టి భారీ ఆఫర్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకక్కనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా వీరిలో కృతిశెట్టి ఒకరనే చర్చ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజంగా నిజం ఉందా.? లేదంటే గాలి వార్తేనా తెలిలాయంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కేలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఈ సినిమాల తర్వాత మారుతి సినిమాను మొదలు పెట్టనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Prabhas

Also Read: దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్.. రాజకీయ అవతారం ఎప్పుడు ఎత్తారు.. క్రిస్టియన్ జేఏసీ కౌంటర్

Fake Baba: నకిలీ బాబా అరాచకం.. మాయ మాటలతో నమ్మించి.. మహిళా భక్తులను నట్టేట ముంచాడు

SI Suspend: ఎస్సై పై సస్పెన్షన్ వేటు.. మృతుడి బంధువుల ఆరోపణలతో ఉన్నతాధికారుల చర్యలు