Telangana Govt Jobs: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువత పోటీ పరీక్షలకు..

Telangana Govt Jobs: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
Ts Govt Jobs
Follow us
Srilakshmi C

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 16, 2022 | 4:33 PM

Telangana jobs 2022: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు షాద్ నగర్‌లో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. కాగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. రానున్న జాబ్ నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించాలంటే మంచి శిక్షణ అవసరం అవుతుంది. కాబట్టి ఈ ఉచిత ట్రైనింగ్‌ సెంటర్‌ (free coaching centre)లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిపుణుల చేత శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణకు హాజరవ్వగోరే అభ్యర్ధులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా తరగతులు ఈ నెల 21 నుంచి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Also Read:

Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!