Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో 2500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులెవరంటే..

Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నేవీ తాజాగా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ సెయిలర్‌ (Sailor Jobs) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో 2500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులెవరంటే..
Indian Navy Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2022 | 6:51 PM

Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నేవీ తాజాగా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ సెయిలర్‌ (Sailor Jobs) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆర్టిఫిషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) – 500, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) – 2000 ఖాళీలు ఉన్నాయి.

* ఆర్టిఫిషర్‌ అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/10+2లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి. అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2022 నుంచి శిక్షణ ఇస్తారు. ఏఆర్‌ అభ్యర్థులకు 9 నెలలు, ఎస్‌ఎస్‌ఆర్‌ వారికి 22 నెలల ట్రైనింగ్ ఉంటుంది.

* శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైపెండ్ ఇస్తారు, అనంతరం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం పొందొచ్చు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుండగా, ఏప్రిల్‌ 5ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Gun Firing: తెలంగాణ లో తుపాకుల మోత.. ముఠాల ద్వారా అక్రమ రవాణా.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

Telangana Govt Jobs: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?