The Kashmir Files: సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా…?
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రం.
Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రం. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సహా పలువురు నేతలు ఈ చిత్రాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ మూవీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అస్సాం(Assam) గవర్నమెంట్ అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. విమర్శకులు ప్రశంసలు సైతం అందుకుంటుంది ఈ మూవీ. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.67.35 కోట్ల కలెక్షన్లు సాధించి.. 100 ఓట్ల దిశగా పరుగులు పెడుతుంది. కాగా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని నెటిజన్లు తెగ సెర్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ 5 సొంతం చేసుకుంది.
నిజానికి ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ కారణంగా.. ఓటీటీ రిలీజ్ ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మే 6 నుంచి జీ5లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అఫిషియల్ ప్రకటన లేదు. 1990లలో జమ్మూ-కశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు చెలరేగింది. అల్లరిమూకలు తుపాకులతో స్వైర విహారం చేశాయి. కశ్మీరీ హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం సృష్టించాయి. ఆ దారుణాల్ని తట్టుకోలేక సొంత ఇంటినీ, ఆస్తుల్నీ, బంధుత్వాల్నీ.. వదిలి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయాయి ఎన్నో కుటుంబాలు. ఆ కన్నీటి వెతల రూపమే ‘ది కశ్మీర్ ఫైల్స్. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.
Also Read: Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే