RRR Pre Release Event: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్

RRR Pre Release Event: దక్షిణాది(South India) మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా జక్కన్న రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. 

RRR Pre Release Event: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్
Rrr Moive
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2022 | 6:34 PM

RRR Pre Release Event: దక్షిణాది(South India) మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా జక్కన్న రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్..  మార్చి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. నందమూరి, మెగా హీరోలను ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి హీరోల అభిమానులే కాదు యావత్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.  అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు వేదికగా కర్ణాటక. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్నాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కర్ణాటకలోని తెలుగు వారితో పాటు.. సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Rrr Movie Pre Relase Event

Rrr Movie Pre Relase Event

రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ఐదు భాషలతో పాటు.. ఇంగిలీషు లో కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తారక్ ఓ సూపర్ కంప్యూటర్ లాంటి వాడని..  షూటింగ్ టైమ్ లో చాలాసార్లు చరణ్ తన నటనతో ఆశ్చర్యానికి గురి చేశాడని .. తన హీరోలపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ లో .. తారక్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్‌  అల్లూరి సీతారామ రాజు పాత్రలు నటిస్తున్నారు.  ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు.  ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.

Also Read:

సచిన్ ప్రపంచ రికార్డుకు పదేళ్లు.. దరిదాపుల్లో కూడా లేని నేటి క్రికెటర్లు.. అదేంటో తెలుసా?