Watch Video: సచిన్ ప్రపంచ రికార్డుకు పదేళ్లు.. దరిదాపుల్లో కూడా లేని నేటి క్రికెటర్లు.. అదేంటో తెలుసా?

Sachin Tendulkar 100th Century: 2012 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ సాధించి, అతర్జాతీయంగా ఓ భారీ రికార్డును నెలకొల్పాడు. అయితే, ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

Watch Video: సచిన్ ప్రపంచ రికార్డుకు పదేళ్లు.. దరిదాపుల్లో కూడా లేని నేటి క్రికెటర్లు.. అదేంటో తెలుసా?
Sachin Tendulkar
Follow us
Venkata Chari

|

Updated on: Mar 16, 2022 | 2:49 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు.. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఈ రికార్డును టీమిండియా దిగ్గజ ప్లేయర్, క్రికెట్ గాడ్‌గా పిలిచే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar 100th century) మాత్రం పూర్తి చేశాడు. 100 సెంచరీలు బాదేశాడు. 2012లో ఇదే రోజున సచిన్ ఈ స్పెషల్ రికార్డును సాధించాడు. 2012 లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్‌(Asia Cup 2012) లో సచిన్ మిర్పూర్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. 100 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ సెంచరీని కేవలం 17 సంవత్సరాల వయస్సులోనే బాదేశాడు. తరువాతి రెండు దశాబ్దాలలో అతను 100 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మిర్పూర్‌లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 147 బంతుల్లో 114 పరుగులు చేశాడు. సెంచరీ కోసం సచిన్ 138 బంతులు ఆడాడు.

సచిన్ టెండూల్కర్ శతకాల సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన ఆ మ్యాచులో.. టీమిండియా ఓడిపోయింది. అయితే, దీనికి సచిన్ స్లో ఇన్నింగ్స్ కారణమని పలువురు విమర్శకులు పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 289 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

సచిన్ సెంచరీపై విమర్శలు గుప్పించిన వకార్ యూనిస్..

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సచిన్‌పై స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వకార్ యూనిస్ మాట్లాడుతూ, ‘చాలా మందికి ఈ విషయం నచ్చదు. కానీ, సచిన్ సెంచరీ కారణంగా, టీమిండియా మ్యాచ్‌లో ఓడిపోయింది. భారత్ 300 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అలా జరగకపోవడం వల్లే మ్యాచులో ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సచిన్ రికార్డును బ్రేక్ చేసేవారున్నారా?

సచిన్ టెండూల్కర్‌పై విమర్శలు వచ్చినా 100 సెంచరీలకు ప్రపంచం కూడా సలాం చేసింది. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టమని అందరికి తెలసిందే. సచిన్ తర్వాత పాంటింగ్ 71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కోహ్లీ కూడా 70 సెంచరీలు సాధించాడు. అతను సచిన్ రికార్డును బద్దలు కొట్టగలడని నమ్ముతున్నారు. అయితే గత రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేక పోవడంతో ఇప్పుడు ఈ విషయంపై అందరిలోనూ అనుమానం మొదలైంది.

Also Read: IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?