IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..

రాజస్థాన్ రాయల్స్ టీం తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. అయితే, ఆ జట్టు జెర్సీని లాంచ్ చేసిన విధానం మాత్రం ఎంతో షాక్‌‌కు గురిచేసింది.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..
Ipl 2022 Rajasthan Royals New Jersey
Follow us
Venkata Chari

|

Updated on: Mar 15, 2022 | 8:22 PM

ఐపీఎల్ 2022(IPL 2022) ప్రారంభానికి కొద్దిరోజులే సమయం ఉంది. దీనికి ముందు, అన్ని టీమ్‌లు సన్నాహాలు ప్రారంభించాయి. టోర్నమెంట్‌లోని చాలా జట్లు కొత్త జెర్సీలను కూడా విడుదల చేశాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కూడా తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. అయితే, జట్టు జెర్సీని లాంచ్ చేసిన విధానం ఇంతకుముందు చూసి ఉండరు. రాజస్థాన్ జెర్సీ లాంచ్ అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్‌తో విడుదల చేశారు. దీనిపై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. జెర్సీ లాంచ్ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియన్ స్టంట్ పెర్ఫార్మర్ రాబీ మాడిసన్‌ను రాజస్థాన్ ఆహ్వానించింది. అతను జట్టు జెర్సీ లాంచ్‌ను చాలా ప్రమాదకరమైన స్టంట్స్‌ ప్రదర్శిస్తూ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్.. తన ట్విట్టర్‌లో పంచుకుంది.

ఇందులో రాబీ రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీని బైక్‌పై నుంచి సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వరకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో బైక్‌పై చాలా చోట్ల ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. చివరగా అతను స్టేడియం చేరుకుని జెర్సీని యుజ్వేంద్ర చాహల్, సంజు శాంసన్‌లకు అందజేస్తాడు. ఈమేరకు ఫ్యాన్స్ కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జెర్సీ లాంఛ్ కోసం ఇంత హంగామా అవసరమా అంటూ కొందరు.. ఈ మాత్రం ఉండాల్సిందేనంటూ మరికొందరు కామెంట్లు పంచుకున్నారు.

ఈ సీజన్‌లో రాజస్థాన్ తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మార్చి 29న మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో, ఆ జట్టు తన తదుపరి లీగ్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. రాజస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ మే 20న ముంబైలో జరగనుంది.

Also Read: 248 సిక్సర్లు.. 268 ఫోర్లు.. సీఎస్‌కే పవర్ హిట్టర్.. కట్ చేస్తే కోచ్‌గా ప్రత్యక్షం..!

IPL Bio-Bubble: బయో బబుల్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్.. రిపీటైతే టోర్నీ నుంచే ఔట్.. షాకిస్తోన్న బీసీసీఐ కొత్త రూల్స్..