RRR Movie: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్‌ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..

RRR Movie: కోట్లాది మంది సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. అన్ని అడ్డంకులను తొలగించుకొని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది...

RRR Movie: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్‌ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..
Rrr Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2022 | 4:35 PM

RRR Movie: కోట్లాది మంది సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. అన్ని అడ్డంకులను తొలగించుకొని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంత వరకు అపజయం అంటూ ఎరగని రాజమౌళి ( Rajamouli) దర్శకత్వం వహించడం, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) తొలిసారి కలిసి నటిస్తుండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. దేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా కేవలం కొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది.

ఇప్పటికే పలు జాతీయ మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ తాజాగా తెలుగులో సరికొత్త ఇంటర్వ్యూను ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి యాంకర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సందర్భంగా అనిల్‌ అడిగిన పలు ఆసక్తికర విషయాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్‌ రావిపూడి, రాజమౌళిని ఉద్దేశిస్తూ.. ‘రాజమౌళి సర్ ఇద్దరూ సూపర్ స్టార్లను ఒకే స్క్రీన్‌పై చూపిస్తున్నారు.. బ్యాలెన్స్ ఉంటుంది కదా.?’ అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన జక్కన్న.. ‘బ్యాలెన్స్ అంటే.. పాటలు, ఫైట్లు, డైలాగులు అలా కాకుండా.. భావోద్వేగాల పరంగా సినిమా చివరకు వచ్చేసరికి ఇద్దరి అభిమానులు సంతృప్తి పడేలా ఉంటుంది. నాకు తెలిసి సినిమా ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లోనే ఇద్దరు హీరోలు, వారి పాపులారిటీని అందరూ మర్చిపోతారు. సినిమాలో రామ్, భీమ్‌ను మాత్రమే చూస్తారు’ అని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్‌ చెప్పిన మరికొన్ని ఆసక్తికర విశేషాల కోసం పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి..

ఇదిలా ఉంటే మార్చి 25న విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతరామమారు, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే హిందీలో ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ జరగగా తాజాగా మార్చి 19న సాయత్రంగా 6 గంటలకు కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సౌత్‌ అన్ని భాషలకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

Also Read: తెలుగురాష్ట్రాల్లో మారిన పది, ఇంటర్ – 2022 పరీక్షల షెడ్యూళ్లు! అసలెందుకు మార్చారో తెలుసా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..

Holi 2022: ఈ అందమైన ప్రాంతాలను సందర్శించి హోలీని మరింత రంగుల మయం చేసుకోండి..