Andhra Pradesh: ‘దిశ’ ఎఫెక్ట్.. బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. గతేడాది ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టం సత్ఫలితాలనిస్తోంది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ, వెంటనే శిక్ష అమలయ్యేలా అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు.

Andhra Pradesh: ‘దిశ’ ఎఫెక్ట్.. బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. గతేడాది ఏం జరిగిందంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 23, 2023 | 7:37 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టం సత్ఫలితాలనిస్తోంది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ, వెంటనే శిక్ష అమలయ్యేలా అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా.. బాలికపై అత్యాచారం కేసులో విశాఖపట్నం పోక్సో కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పును వెల్లడించింది. అయితే, నిందితుడు మైనర్‌ కావడంతో ప్రస్తుతం జువెనైల్‌ హోమ్‌కు తరలించి, 21 ఏళ్లు వచ్చిన తరువాత జైలుకు తరలించాలంటూ ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

దిశ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మే 8న అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఓ బాలికను సమీపంలో ఉండే ఓ బాలుడు (17).. ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత రోజు కూడా మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి మేనత్త గమనించి బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి బాలుడిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు బాలుడిపై పోస్కో, దిశా చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.

పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనకాపల్లి దిశ డీఎస్పీ.. పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడైన బాలుడికి విశాఖపట్నం స్పెషల్ సెషన్ జడ్జి 20 సంవత్సరాల శిక్ష విధించారు. దీంతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలికకు ప్రభుత్వం రూ.లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

అయితే, దిశ చట్టం ప్రకారం నిందితుడికి సరైన శిక్ష వేశారని బాధితురాలి తల్లి సంతోషం వ్యక్తంచేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా.. ఈ ఏడాది 84 మంది నిందితులకు దిశ చట్టం ప్రకారం శిక్ష ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై