AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh కొడుకులు కాదు మృగాలు.. ఇంటికి తాళం వేసి తల్లిదండ్రుల్ని గెంటేసిన కుమారులు

వృద్ధాప్యంలో కొడుకుల పంచన ఉండాల్సిన వారు రోడ్డున పడిన ఘటన దుగ్గిరాల మండలం ఈమనిలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ్యారు. కనిపెంచిన ప్రేమ ఆ కన్నకొడుకులకు లేకుండా పోయింది.

Andhra Pradesh కొడుకులు కాదు మృగాలు.. ఇంటికి తాళం వేసి తల్లిదండ్రుల్ని గెంటేసిన కుమారులు
Where Is Humanity
Surya Kala
|

Updated on: May 23, 2023 | 7:50 AM

Share

కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడాన్ని భారంగా ఫీలవుతున్నారు కడుపున పుట్టిన పిల్లలు. బుక్కెడు అన్నం పెట్టడానికి మనసు రాక వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని చూడకుండా ఆస్తి, పాస్తులని లెక్కలేసుకుని గిరిగీసుకుని బతుకుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను ఆస్తి కోసం బయటికి గెంటేశారు ఇద్దరు కొడుకులు. వృద్ధాప్యంలో కొడుకుల పంచన ఉండాల్సిన వారు రోడ్డున పడిన ఘటన గుంటూరు జిల్లాలో ఈమనిలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ్యారు. కనిపెంచిన ప్రేమ ఆ కన్నకొడుకులకు లేకుండా పోయింది. తమకు జీవితం ప్రసాదించిన తల్లిదండ్రులను కాదు పొమ్మనడంతో చివరకు రోడ్డుమీద పడ్డారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈ అమానుషం చోటు చేసుకుంది. ఈమనిలో తల్లిదండ్రులను ఇద్దరు కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కన్నకొడుకులే మానవత్వం లేకుండా వ్యవహరించారు. తల్లిదండ్రులు సంపాదించిన పొలాన్ని తమ పేరిట రాయాలని ఒత్తడి చేశారు. వారు ఒప్పుకోకపోవడంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేశారు. ఇంటికి తాళం వేసుకున్నారు. పెద్ద కుమారుడు రామకృష్ణ నల్ల పాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పని చేస్తున్నాడు. అతని తమ్ముడు మల్లిఖార్జున రావు కూలీ పనులకు వెళ్తుంటాడు. కొడుకులుపెట్టే చిత్ర హింసలు భరించలేక చివరకు స్పందనలో ఫిర్యాదు చేశారు వృద్ధ దంపతులు. ఆస్తి కోసమే చిత్ర హింసలు పెడుతున్నారని ఆ తల్లి వాపోయింది. తన పరిస్థితిని వివరించి బోరున విలపించింది.

గ్రామస్థుల సహకారంతో గుడిసె వేసుకొని ఉంటున్నారు ఈ వృద్ధ దంపతులు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఇద్దరు కొడుకుల బారి నుంచి తమను కాపాడాలని తల్లి ద్రండ్రులు గుళ్ళకమ్మ, శ్రీనివాస్ రావు వేడుకుంటున్నారు. వీరి దీనస్థితిని చూసి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..