AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Teachers Transfers: ఏపీలోని టీచర్లకు బిగ్ అలర్ట్.. ట్రాన్స్‌ఫర్స్ గైడ్‌లైన్స్, షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..

ప్రభుత్వ టీచర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, షెడ్యూల్ ను విడుదల చేసింది. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

AP Teachers Transfers: ఏపీలోని టీచర్లకు బిగ్ అలర్ట్.. ట్రాన్స్‌ఫర్స్ గైడ్‌లైన్స్, షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..
Teachers Transfers
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2023 | 8:06 AM

Share

ప్రభుత్వ టీచర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, షెడ్యూల్ ను విడుదల చేసింది. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బదిలీల విషయమై జగన్ ప్రభుత్వం వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన హెడ్మాస్టర్ బదిలీ తప్పనిసరి అని జగన్ సర్కార్ పేర్కొ్ంది. కొత్త జిల్లాలు యూనిట్ గా టీచర్ల బదిలీలను నిర్వహించనుంది. ఈ నెల 31లోపుగా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులతోనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ల బదిలీల కోసం జీవో నం.47ను విడుదల చేసింది.

ఐదు రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. టీచర్ల ట్రాన్స్ఫర్లపై సమావేశం చర్చించారు. గతంలో కూడా ఇదే విషయమై ఉపాధ్యా సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించారు. ఇక ఈ నెల 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, జూన్ 1 నుండి మళ్లీ నిషేధం వర్తిస్తుంది. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం కల్పిస్తూ.. ఈ మేరకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి అయిన వారికి బదిలీ తప్పనిసరిగా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

అలాగే 2023 ఏప్రిల్ 30 నాటికి ఒకే చోట్ రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిక్వెస్ట్ పై బదిలీకి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బదిలీల్లో భార్యాభర్తలకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులు అవుతారని సర్కారు తేల్చి చెప్పింది. బదిలీలు అన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థనగానే పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ గైడ్ లైన్స్ జీవో ప్రకారం టీచర్స్ బదిలీల కౌన్సిలింగ్ తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది.

  • రేపటి నుంచి (మే 24) ఈ నెల 26 వరకూ బదిలీల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే ఛాన్స్.
  • ఈ నెల 25 నుంచి 27 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన.
  • జూన్ 4 న ఖాళీల ప్రకటన.
  • జూన్ 5 నుంచి 8 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం.
  • జూన్ 9 న హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీల జాబితా.
  • జూన్ 9 నుంచి 11 వరకూ SGT ల బదిలీ జాబితా విడుదల.
  • మొత్తం 19 రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ను విడుదల చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..