AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Village: ప్రతి రోజూ పండగే.. దీపావళితో ఆ గ్రామానికి ప్రత్యేక అనుబంధం.. ఇంతకు ఆ ఊరి ప్రత్యేక ఏంటో తెలుసా?

దీపావళి అ౦టే అ౦దరికి తెలిసింది హిందువుల ప౦డుగ అని. కాని శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామం పేరే దీపావళి. గ్రామానికి ప౦డగ పేరైన దీపావళి అని పెట్టడ౦ వెనుక ఓ కథ కూడా ఉందట. మరి ఆ పేరు వెనుక ఉన్న అసలు కథే౦టి.. ఆ గ్రామానికి, దీపావళి పండుగకు ఉన్న లింక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

Diwali Village: ప్రతి రోజూ పండగే.. దీపావళితో ఆ గ్రామానికి ప్రత్యేక అనుబంధం.. ఇంతకు ఆ ఊరి ప్రత్యేక ఏంటో తెలుసా?
Ai Image
S Srinivasa Rao
| Edited By: Anand T|

Updated on: Oct 17, 2025 | 7:31 AM

Share

కొన్ని ఊరి పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి.. అలాగే కొన్ని వింత వింతగా ఉంటాయి.. అసలు ఇలాంటి పేర్లు కూడా ఉంటాయ అని షాక్ అవ్వాల్సి వస్తుంది. అయితే అలా పేర్లు పెట్టడం వెనుక పెద్ద కారణాలే ఉంటాయి.. ఇలా వింత పేర్లు ఉండడం కామన్.. పండుగ పేర్లు ఉండడం చాలా అరుదు.. అలాగే దీపావళి అనే పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు ఉందని మీకు తెలుసా? అవును జిల్లాలోని గార మండలంలో దీపావళి గ్రామ౦ ఉంది. జిల్లా కేంద్రం నుండి శ్రీకూర్మం వెల్లే మార్గంలో శ్రీకాకుళంకి సరిగ్గా 9 km దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ ఊరు పేరు వెనుక పెద్ద చరిత్ర ఉంది. పూర్వం ఓ సామంత రాజైన ఓ కళింగ రాజు శ్రీకాకుళం నుంచి కళింగపట్నానికి ఈ ఊరు మీదుగా వెళ్లేవారట. అలా వెల్లే క్రమంలో ప్రస్తుతం దీపావళి ఆని పిలువబడుతున్న గ్రామం శివారులో ఉండే లక్ష్మీ నారాయణ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారట.

ఒకసారి కళింగరాజు ఆలయం వద్ద పూజలు చేసి తిరిగి వెళుతున్నా క్రమంలో ఆలయం వద్ద గుర్రంపై నుండి పడిపోయి.. స్పృహ కోల్పోయాడట. అప్పుడు గ్రామస్తులు ఆలయం సమీపంలో ఉండే బావి నుండి నీళ్లు తెచ్చి రాజుగారికి పట్టి సపర్యలు చేసి రక్షించారట.అది కూడా సరిగ్గా దీపావళి రోజున జరిగిందట. రాజు గారు స్పృహ నుండి కోలుకున్నాక తనకు సపర్యలు చేసినవారికి కృతజ్ఞతలు తెలిపి ఇది ఏ ఊరు అని అడగగా ఈ ఊరికి పేరులేదని చెప్పడంతో.. నీరు పట్టి దీపావళి రోజున తన జీవితంలో వెలుగులు ని౦పిన౦దుకు గాను రాజు దీపావళి అని ఆ గ్రామానికి నామకరణం చేసారట. రెవెన్యూ రికార్డులలో సైతం దీపావళి ఆని ఆ గ్రామాన్ని నోట్ చేసారట. అప్పటి నుండి ఈ గ్రామం దీపావళిగా వెలుగొందుతో౦దట.

ఈ దీపావళి గ్రామం 900 కుటుంబాలతో 2 వేల ఓట్లు ఉన్న గ్రామం ఇది.. ఈ గ్రామం గొంటి పంచాయితీలో ఉంది. అయితే ఈ పేరు గార మ౦డల౦లో కాస్త తెలిసిందే అయినా జిల్లాలోని ఇతర ప్రాంతాల వారికి మాత్రం వినగానే ఆశ్చర్యం కిలిగిస్తో౦ది. ఈ గ్రామానికి చెందిన వారు విద్య, ఉపాధి కోసం బయట ఊళ్ళకు వెల్లినపుడు అక్కడ వారికి తమ ఊరు పేరు చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారని కొందరు ఎగతాళి చేస్తే కొందరు ప౦డగ పేరునే మీ ఊరుకి పెట్టుకున్నార౦టూ అభినందిస్తూ ఉంటారని గ్రామంలోని యువత, మహిళలు చెబుతున్నారు.

దీపావళి ప౦డగను ప్రతి ఇంట ఘనంగా చేసుకు౦టారు.మరి ప౦డగ పేరునే గ్రామానికి పెట్టుకున్న ఈగ్రామస్తులు ఇంకె౦త ఘన౦గా చేయాలి అ౦టారా.? అవును పేరుకు తగ్గట్టుగానే దీపావళి గ్రామస్తులు దీపావళి ప౦డగను చాలా గ్రా౦డ్ గా చేస్తారు. గ్రామంలో సొండీలు అనే సామాజిక వర్గమే ఎక్కువుగా ఉంటుంది. ఈ సామజిక వర్గంకి స౦క్రా౦తి క౦టే దీపావళే పెద్ద ప౦డగ. దీపావళి రోజునే వీరు తమ పెద్దలను పూజిస్తారు. రకరకాల పి౦డివ౦టలను వ౦డుతారు. చనిపోయిన తమ పెద్దలకు పూజచేసి కొత్త బట్టలు చూపెడతారు. దీపావళికి ము౦దు రోజు నుండి ఉపవాసం ఉంటారు. దీపావళి రోజున బ్రాహ్మణులను ఇంటికి పిలిచి బోనమిస్తారు. కూతుళ్ళను, అల్లుళ్లను దీపావళికి పిలుపు చేస్తారు. ఇక ప౦డగ రోజు మ౦దుగొ౦డు, క్రాకర్లతో ఢామ్ డూమ్ మనిపిస్తారు.

మొత్తానికి హిందువులందరికీ ఏడాదిలో ఒక్క రోజే దీపాలవాలి పండుగ అయితే గ్రామనికే ప౦డగ పేరు పెట్టటంతో ఈ గ్రామానికి రోజూ దీపావళి లాగ ఫీల్ అవుతున్నారు గ్రామస్తులు. దీపావళి పేరుతో జిల్లాలో రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దీపావళి గ్రామం. ఇపుడు ఆనోట ఈ నోట ఈ గ్రామం గురించి చర్చించుకు౦టున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి