AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల పోరాటం.. అంతిమ దశకు వచ్చిందా..? లొంగుబాట్లు ఏం చెబుతున్నాయి..?

ఒకనాడు భూస్వాముల్లో భయం పుట్టించింది మావోయిజం. పీడిత వర్గానికి అండగా నిలిచింది. ఇదీ నిజమే. వెనక 'అన్నలు' ఉన్నారన్న ధైర్యం ఎంతో మందిలో పోరాటాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. అదే ఆరు దశాబ్దాలుగా మావోయిజం నిలబడడానికి కారణమైంది. అసలు ఎక్కడ మొదలైందీ నక్సలిజం. ఏంటి దానికి నేపథ్యం?

60 ఏళ్ల పోరాటం.. అంతిమ దశకు వచ్చిందా..? లొంగుబాట్లు ఏం చెబుతున్నాయి..?
Naxalbari To Maoism
Balaraju Goud
|

Updated on: Oct 16, 2025 | 11:32 PM

Share

నేపాల్ గ్రామీణ ప్రాంతంలోకి ఎవరు అడుగుపెట్టాలో మావోయిస్టులే నిర్ణయించేవారు. ఇప్పటిమాట కాదు ఓ దశాబ్దంన్నర కిందటి పరిస్థితి ఇది. అపట్లో సాయుధ పోరాటంతోనే అన్నీ సాధించగలమని నమ్మారు. బట్.. అంతటి సాయుధశక్తి ప్రజాస్వామ్యానికి తలవంచింది. దీన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. ట్రిగ్గర్ నొక్కితే తుపాకీ పేలుతుంది. నిజమే. ఎవరి మీదకి ఆ గురి? ఇది కదా క్లారిటీ ఉండాల్సింది. అప్పటికే 16వేల మంది చనిపోయారు. ఏం సాధించారు ఆ మారణహోమంతో అంటే.. నో ఆన్సర్. ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లారు కాబట్టే నేపాల్‌లో మావోయిస్టులు గెలిచారు. మరో ఎగ్జాంపుల్. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర దిశనాయకే. ఓ కమ్యూనిస్టు నేత. ఆయుధమే సమాధానం చెబుతుందని ఒకనాడు నమ్మిన వ్యక్తి. రెండుసార్లు సాయుధ పోరాటం చేసి, క్యాడర్‌ను పోగొట్టుకుని, చేసేది లేక పోరాటం రూపం మార్చుకున్నారు. ప్రజాస్వామ్యం తప్ప మరో దారి కనిపించలేదతనికి. తిరిగి చూస్తే.. ఏకంగా దేశ ప్రధాని అయ్యారు. ఇది కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే. ప్రపంచం నిరంతరం మారుతుందన్నది నమ్మకం కాదు నిజం. ఆ వాస్తవాన్ని స్వీకరించలేకపోయింది ఇక్కడి మావోయిస్టు పార్టీ. దాని ఫలితమే ఈ చీకటి. 60 ఏళ్ల పాటు ఒక సిద్ధాంతం, ఒక పోరాటం నిలబడిందంటే.. ‘శభాష్’ అదే గొప్ప విజయం. కాని, ఇప్పటికీ అదే దారిలో వెళ్తామంటే..! ఆ మార్పు స్వాగతించనందుకు కాదా ఈ సంక్షోభం? నక్సల్బరీ నుంచి మావోయిజంగా మారి సాధించిందేంటి?...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి