AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: పెట్రోల్ కొట్టించుకుని.. స్టార్ట్ చేశాడు.. అంతే

ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న వెంటనే ఓ యువకుడి బుల్లెట్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన యువకుడు బైక్‌పై నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉండటంతో బైక్ పూర్తిగా దగ్ధమై, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Khammam: పెట్రోల్ కొట్టించుకుని.. స్టార్ట్ చేశాడు.. అంతే
Bike Burnt
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 1:37 PM

Share

మీరు బుల్లెట్ బైక్ నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త. రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే కాదు.. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఖమ్మం నగరంలో ఓ యువకుడి బుల్లెట్ ఒక్కసారిగా మంటల్లో చిక్కి పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న యువకుడు బయటికి వెళ్లే సమయంలో… అతని బుల్లెట్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన యువకుడు బైక్‌పై నుంచి కిందపడిపోయి వెంటనే పక్కకు దూకాడు. దీంతో అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే అప్పటికే బైక్ భారీగా మంటల్లో తగలబడుతుండడంతో. బంక్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉండటంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ప్రమాదం మరింత పెరగకుండా బైక్‌ను బైపాస్ రోడ్డు వైపు తీసుకెళ్లి అక్కడ మంటలు ఆర్పేశారు. ఈ ఘటన ఖమ్మం వాహనదారులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. బైక్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే యువకుడికి ప్రాణాపాయం తప్పడంతో పాటు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు
ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్
ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్
హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలు..
హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలు..
పెట్రోల్, డీజర్ ధరలు పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా?
పెట్రోల్, డీజర్ ధరలు పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా?
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా టేస్టీ శాండ్‌విచ్‌ చేసుకోండి..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా టేస్టీ శాండ్‌విచ్‌ చేసుకోండి..
ఇంట్లో నెమలి ఈకలు ఉన్నాయా? ఈ దిశలో పెడితేనే అదృష్టం.. లేదంటే..
ఇంట్లో నెమలి ఈకలు ఉన్నాయా? ఈ దిశలో పెడితేనే అదృష్టం.. లేదంటే..
మీ ఇంటి కిటికీలో ఈ ఒక్కటి ఉంచితే ఒక్క దోమ కూడా ప్రవేశించవ్‌..!
మీ ఇంటి కిటికీలో ఈ ఒక్కటి ఉంచితే ఒక్క దోమ కూడా ప్రవేశించవ్‌..!
పరిటాల రవి చెప్పినా.. నో చెప్పిన కొడాలి నాని.. ఎందుకంటే
పరిటాల రవి చెప్పినా.. నో చెప్పిన కొడాలి నాని.. ఎందుకంటే
చెన్నై కోటను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ ఐదు సింహాలు రెడీ
చెన్నై కోటను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ ఐదు సింహాలు రెడీ
ఏ పని చేయకపోయినా రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా?
ఏ పని చేయకపోయినా రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా?