YS Jagan: పులివెందుల అంటే నమ్మకం.. ధైర్యం.. నా ప్రాణం.. వివేకాను ఎవరు చంపించారో ప్రజలకు తెలుసు
వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు.. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి..? అంటూ జగన్ ప్రశ్నించారు. చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం.. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుందంటూ.. జగన్ పేర్కొన్నారు.
నా పులివెందుల.. నా సొంత గడ్డ.. నా ప్రాణానికి ప్రాణం.. పులివెందుల అంటే నమ్మకం.. ధైర్యం.. పులివెందుల అంటే ఒక అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ.. కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణానది నీళ్లు తెచ్చాం.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ పులివెందులలో నామినేషన్ వేయబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్.. పులివెందుల సీఎస్‌ఐ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపించారో జిల్లా ప్రజలకు తెలుసు.. అంటూ జగన్ పేర్కొన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్ధతిస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? .. అవినాష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అవినాష్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు.. అవినాష్‌రెడ్డి జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు.. వైఎస్ అవినాష్ ఏ తప్పూ చేయలేదని నమ్ముతున్నా.. వైఎస్ఆర్ పేరు చెరిపేసే కుట్ర జరగుతుందంటూ జగన్ పేర్కొన్నారు.
మంచి చేయడం మన కల్చర్..
మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని నిలబెట్టింది పులివెందుల బిడ్డలే అంటూ జగన్ పేర్కొన్నారు. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. మనం మంచి చేసేవాళ్లం కాబట్టే.. వైఎస్సార్, జగన్‌ను అభిమానించేవాళ్లు ప్రతి గ్రామంలో ఉన్నారు.. అంటూ పేర్కొన్నారు. ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ కుట్రలను మీరంతా చూస్తున్నారు కదా అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్.. పురంధేశ్వరిపై ఫైర్ అయ్యారు.
వైఎస్‌ఆర్ వారసులు అంటూ కుట్రలు
వైఎస్‌ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామంటూ జగన్ పేర్కొన్నారు. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా.. వైఎస్‌ఆర్ చనిపోయాక ఆయన కుటుంబం మీద కుట్రలు చేసింది ఎవరు? వైఎస్‌ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది ఎవరు? వైఎస్‌ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరు? అంటూ జగన్ ప్రశ్నించారు. మన శత్రువులతో కలిసి.. వారి పార్టీలో చేరిపోయిన వాళ్లా వైఎస్‌ఆర్ వారసులు.. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుట్రలో భాగమవుతున్న వీళ్లా వైఎస్‌ఆర్ వారసులు అంటూ పరోక్షంగా షర్మిలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్‌ఆర్ విగ్రహాలను ముక్కలు చేస్తామన్న వాళ్లతో చేతులు కలిపిన వాళ్లా వారసులు.. మీ బిడ్డ ఒక్కడి మీదకు ఇంత మంది కలిసి వస్తున్నారు.. రాజకీయాలకు ఏ స్థాయిలో పడిపోయాయో చూడండి అంటూ అన్నారు. వైయస్సార్ ఎవరితో పోరాటం చేశారో.. యుద్ధం చేశారో.. వారితో చేతులు కలిపిన వాళ్లా వైయస్సార్ వారసులా..? అని ప్రశ్నించారు సీఎం జగన్.
చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం..
వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు.. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి..? అంటూ జగన్ ప్రశ్నించారు. చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం.. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుందంటూ.. జగన్ పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ పేరు కనపడకుండా ప్రయత్నిస్తున్న వారికి ఓటువేస్తే.. మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అంటూ జగన్ అన్నారు. కడప గడ్డమీద ఎవరికి ప్రేమ ఉందనేది మీరంతా గమనించాలి.. వైఎస్‌ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆరాటపడుతున్నదెవరో ఆలోచన చెయ్యండి.. వైఎస్‌ఆర్ పేరు లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నది ఎవరో గమనించండి.. అంటూ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..