Andhra: నగ్నంగా మారి మంత్ర తంత్ర విద్యలతో నోట్ల వర్షం కురిపించాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన వెంకట్రావు వ్యవసాయం చేస్తూ, అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం ఊహించని మలుపులు తిరిగింది.

తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన వెంకట్రావు పొలం పనులు చేసుకొని జీవిస్తుంటాడు. అప్పుడప్పుడు కారు డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సుధాకర్ అవసరమైనప్పుడల్లా వెంకట్రావునే డ్రైవర్‌గా తీసుకెళ్లేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే సుధాకర్ తనకు తాంత్రిక విద్యలు వచ్చని వాటితో డబ్బుల వర్షం కురిపిస్తానని చెప్పాడు. మొదట వెంకట్రావు ఇవన్నీ నమ్మలేదు. అయితే ఒకరోజు సుధాకర్ పూర్తి నగ్నంగా మారి.. తెల్ల కాగితానికి ద్రవం పూసి గాల్లోకి విసిరేశాడు. వెంటనే ఐదు వందల రూపాయల నోట్ల కింద పడ్డాయి. ఆశ్చర్యపోయిన వెంకట్రావు వాటిని తీసుకెళ్లి షాపింగ్ చేశాడు. ఆ తర్వాత సుధాకర్ కొంత మొత్తం ఇవ్వమని.. వెంకట్రావును కోరాడు. నీకు మంత్ర విద్య వచ్చుగా.. దానితోనే డబ్బులు సృష్టించుకోవచ్చుగా అని వెంకట్రావు ప్రశ్నించాడు. అయితే డబ్బులు వర్షం కురిపించాలంటే పెద్ద మొత్తంలో పాదరసం కొనుగోలు చేయాలని అందుకు నగదు అవసరం అని చెప్పాడు. అంతే కాకుండా ఇందుకు గాను ఇరవై ఒక్క రోజులు పడుతుందని చెప్పాడు.
సుధాకర్ మాటలు నమ్మిన వెంకట్రావు…. తన మేనకోడలి ఖాతా నుండి పది లక్షల రూపాయలను సుధాకర్‌కు పంపించాడు. పది లక్షలకు 10 రెట్లు అంటే కోటి రూపాయల వర్షం ఇరవై ఒక్క రోజుల్లో కురిపిస్తానని చెప్పాడు. అయితే చెప్పిన టైంకు సుధాకర్ రాకపోవడంతో వెంకట్రావుకు అనుమానం మొదలైంది. తనను మోసం చేసి డబ్బులు గుంజినట్లు భావించిన వెంకట్రావు… సుధాకర్‌కు ఎస్సీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుధాకర్ కోసం గాలించడం మొదలు పెట్టారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
