AP Politics: ఏపీలో పొలిటికల్ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్ ఏంటి?
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి.
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి. రాజకీయంగా ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైసీపీ ఎన్నికల్లో గట్టెక్కుతుందా. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో ఫ్యాక్ట్‌లు పక్కనపెట్టి ఎన్నికల కోసం ప్రత్యర్ధి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న వైసీపీ దీనిపై ఇస్తున్న సమాధానంతో జనాలు కన్వీన్స్ అవుతున్నారా?
ఏపీ లో రాజకీయాలు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టే తిరుగుతున్నాయి. పోలింగ్‌కు సమీపిస్తున్న నేపథ్యంలో యాక్ట్‌పై రచ్చ రోజురోజుకు పెరుగుతోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ దీనిపై కేసులు పెడుతోంది. అయినా ప్రతిపక్షాలు ప్రచారాన్ని ఆపడం లేదు. టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు మాజీ అధికారులు కుట్రపూరితంగా ప్రకటనలు చేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ల్యాండ్ యాక్ట్‌లో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకునే ఎత్తుగడతో వస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు.
ఎన్నికల వేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ కొద్దిరోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలోనే.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేయడం.. కొత్త డీజీపీగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తాను ఈసీ నియమించడం చకాచకా జరిగిపోయాయి. అటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఏపీ సీఎస్‌కు స్పష్టం చేసింది. అంతకుముందు పదుల సంఖ్యలో అధికారులపై వేటు పడింది. సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇప్పటికే విధుల నుంచి తప్పుకున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర నాయకులు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ల్యాండ్, శ్యాండ్, వైన్ మాఫియాలు నడుస్తున్నాయని.. జీవనాడి పోలవరం, రాజధాని ఆపేశారని ఆరోపించారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇందులో ఎవరు విజయం అందుకునిఅధికార పగ్గాలు అందుకుంటారో చూడాలి.