Telangana News: ఓర్నీ.. పొల్లాలోనే టమాటాలను తగలబెడుతున్న రైతులు..ఎందుకంటే?
పొల్లాలోనే టమాటాలను రైతులు తగలబెడుతున్నారు. తిన్న టమాటాలను ఎందుకు తగలబెడుతున్నారని అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందంటే? మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్‌పేట టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక పంటను తగలబెట్టుకుంటున్నారు. ఎక్కువమంది రైతులు టమాట సాగు చేశారు. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ ప్రాంతాలు హైదరాబాద్‌కి దగ్గరగ ఉండడంతో పండిన పంటను హైదరాబాద్‌కి తరలించేవారు.
టమాట రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం టమాటకి మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో.. టమాటా పండించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని చాలామంది రైతులు వారు పండించిన టమాటలను తగలబెడుతున్నారు. మరికొంతమంది పొలాల్లోనే వదిలి వేస్తున్నారు.పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ పంటైన టమాట సాగు నష్టాల బాటలో ఉంది. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్‌పేట టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక పంటను తగలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల వరిసాగుతో పాటు కూరగాయలు పండిస్తారు. సీజనలో పండించే పంటైన టమాటను ఎక్కువగా పండిస్తారు. ఈసారి కూడా వాతావరణం అనుకూలించడంతో ఎక్కువమంది రైతులు టమాట సాగు చేశారు. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ ప్రాంతాలు హైదరాబాద్‌కి దగ్గరగ ఉండడంతో పండిన పంటను హైదరాబాద్‌కి తరలించేవారు.
కాగా ఈసారి టమాట పంటకు రేటు లేకపోవడం బాధాకరమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పండిన పంటను సైతం వదిలి వేస్తున్నారు. ఒక బాక్స్‌కి రూ.50 కూడా రావడం లేదని, అలాంటప్పుడు మార్కెట్‌కి తీసుకుపోయిన లాభం లేదని, రవాణా ఖర్చులు మీద పడుతున్నాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోని టమాటా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. సబ్సిడీలు కేటాయించిన పెట్టుబడి నష్టం తగ్గుతుందని అంటున్నారు. ఇక ఏ సమయంలో ఏ సాగు చేస్తే బాగుంటుందో ప్రభుత్వం సూచనలు ఇచ్చి అవగాహన కల్పించడం వల్ల నష్టపోయిన రైతు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కి సమీపంలోనే ఉండి టమాట సాగు చేసే రైతులు బోయిన్పల్లి మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టమాట బాక్స్ ధర రూ.100 ఉంది. ఒక టమాట బాక్సు తరలించడానికి రూ.35 అవుతుంది. కమిషన్లు అన్ని పోను రూ.40 కూడా సరిగ్గా మిగిలే అవకాశం లేదు. ఇక పోతే పండించిన పంట తెంపడానికి ఒక మనిషికి కూలీ రూ.400 వరకు అవుతోంది. ఒకరోజు మొత్తంలో 10 బాక్సులు తెంపగలడు ఒక కూలీ, ఆటో కిరాయిలు, కమిషన్లు పోను ఏమి మిగలకపోవడంతో పండించిన పొలంలోనే పంట వదిలేస్తున్నామంటూ ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి