AP Weather: అబ్బబ్బా.. ఎంత చల్లటి వార్త.. ఏపీకి వర్ష సూచన..

మండుతున్న ఎండలు.. విపరీతమైన వేడి.. ఉక్కపోత.. వడగాడ్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ తీపి కబురు వినిపించింది. మోస్తరు నుంచి ఒక మోస్తరు వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Weather: అబ్బబ్బా.. ఎంత చల్లటి వార్త.. ఏపీకి వర్ష సూచన..
Andhra Rain Alert
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2024 | 6:33 PM

ద్రోణి / గాలుల కోత మరట్వాడ నుండి దక్షిణి తమిళనాడు వరకు విస్తరించి ఈరోజు తూర్పు విదర్భ నుండి దక్షిణి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక గుండా సగటు సముద్ర మట్టానికి ౦.9కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి . వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది .

మంగళవారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి . వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

బుధవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

సోమవారం :-  తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి, తేమ  అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది

మంగళవారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి . వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

బుధవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .

రాయలసీమ :-

——————-

సోమవారం :-  తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .

మంగళవారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి . వేడి ,తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

బుధవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..