PM Modi: ముందే కాంగ్రెస్‌ ఓటమిని ఒప్పుకుంది.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ ఓటమి ఒప్పుకుంది.. ఐదేళ్ల సమయాన్ని వైసీపీ వృథా చేసింది.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యం..అవినీతిలో నెంబర్‌వన్‌ అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ సోమవారం రాజమండ్రిలో ప్రచారం నిర్వహించారు.

PM Modi: ముందే కాంగ్రెస్‌ ఓటమిని ఒప్పుకుంది.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం: ప్రధాని మోదీ
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 06, 2024 | 5:49 PM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ ఓటమి ఒప్పుకుంది.. ఐదేళ్ల సమయాన్ని వైసీపీ వృథా చేసింది.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యం..అవినీతిలో నెంబర్‌వన్‌ అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ సోమవారం రాజమండ్రిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేమగిరి సభలో మోదీ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ పాలన అంతా స్కామ్‌ల మయమని విమర్శించారు. ఎన్డీఏ పాలన వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని.. కాని ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్‌ లావాదేవీలు చేస్తోందంటూ విమర్శించారు.

ఏపీలో లిక్కర్‌ సిండికేట్‌ నడుస్తోందని.. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యం నడుస్తోందని కొందరు చెబుతున్నారన్నారు. అవినీతి ఫుల్‌ స్పీడ్‌లో ఉంది, అభివృద్ధికి బ్రేక్‌ పడిందన్నారు. మూడు రాజధానులు కడతామన్నారు, ఒక్క రాజధాని కూడా ఇవ్వలేదన్నారు. మూడు రాజధానుల పేరిట లూటీ చేద్దామనుకున్నారు.. కానీ ఖజానా ఖాళీ అయిందంటూ విమర్శించారు. అవినీతిని మేనేజ్‌ చేయగలరు, ఆర్ధిక నిర్వహణ మాత్రం చేయలేరంటూ విమర్శించారు. పోలవరం కడతామన్నారు, ఏపీకి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేశారంటూ విమర్శించారు. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 15వేల కోట్లు ఇచ్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్లనివ్వడంలేదన్నారు. జూన్‌ 4 తర్వాత ఎన్డీఏ సర్కార్‌ ఇలాంటి సమస్యలను దూరం చేస్తుందని.. ఎన్డీఏ పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

ఈ సందర్భంగా జార్ఖండ్ లోని ఓ మంత్రి ఇంట్లో లభించిన నగదుపై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. పక్క రాష్ట్రం జార్ఖండ్‌లో నోట్ల గుట్టలు బయటపడ్డాయని.. అక్కడ దొంగసొత్తును మోదీ పట్టుకుంటున్నారని జనం అంటున్నారన్నారు. ఈ దొంగతనాన్ని, అక్రమ సంపాదనను, దోపిడీని బంద్‌ చేస్తే, నన్ను తిడతున్నారన్నారని.. ఎవరేమి అనుకున్నా.. దొంగ సొమ్మును మాత్రం బయటకు తీస్తామన్నారు. ప్రజలకు పంపిన ఒక్క పైసా కూడా ఎవరినీ తిననివ్వను.. అంటూ మోదీ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..