DGP Harish Kumar Gupta: ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..

పోలింగ్‌కి సరిగ్గా వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.

DGP Harish Kumar Gupta: ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
Dgp Harish Kumar Gupta
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 06, 2024 | 5:51 PM

పోలింగ్‌కి సరిగ్గా వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ప్రస్తుతం హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న హరీష్ కుమార్ గుప్తా.. 1992 క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి. హరీష్ కుమార్ ను కొత్త డీజీపీ గా ఎంపిక చేసిన సిఇసి.. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు.

ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫిర్యాదులు మేరకు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా.. ఆయనకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దంటూ సూచించింది.

డీజీపీ పోస్టు కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ స్థాయి అధికారుల జాబితాను పంపించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..