Watch Video: ‘సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు’.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

ఈ మధ్య తన కుటుంబంలో చిచ్చుపెట్టారని.. అయినా తాను భయపడను అన్నారు ముద్రగడ పద్మనాభం. తన సొంత నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన అమ్మాయి తన ఆస్తి కాదన్నారు. తన కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండని సూచించారు. తన కూతురును మీకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఆమె తన బిడ్డ కాదని అత్తింటి బిడ్డ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగారు కాబట్టి తాను కూడా లాగాల్సి వస్తుందన్నారు.

Watch Video: 'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..
Mudragada Padmanabham
Follow us
Srikar T

|

Updated on: May 06, 2024 | 1:50 PM

ఈ మధ్య తన కుటుంబంలో చిచ్చుపెట్టారని.. అయినా తాను భయపడను అన్నారు ముద్రగడ పద్మనాభం. తన సొంత నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన అమ్మాయి తన ఆస్తి కాదన్నారు. తన కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండని సూచించారు. తన కూతురును మీకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఆమె తన బిడ్డ కాదని అత్తింటి బిడ్డ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగారు కాబట్టి తాను కూడా లాగాల్సి వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ తన ముగ్గురు భార్యలను పరిచయం చేయగలరా అని చురకలు అంటించారు. వారి స్థితిగతులను గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకు, తన కుటుంబ సభ్యులు ఏమి జరిగినా ఇంటికి తన కూతుర్ని పంపించకండన్నారు. ముద్రగడ కూతురుగా కాకుండా.. అత్తింటి పేరు వాడి పరిచయం చేయమన్నారు. ఎలాగో తన అమ్మాయిని రోడ్డుపైకి లాగేసారు కాబట్టి.. టీవీ డిబేట్లలో, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో రోడ్ల మీద తిప్పండని.. తానేమీ భయపడనన్నారు.

కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చుపెట్టమని మీ గురువు చెప్తే మీరు తయారైపోయారా అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ తన కూతురిని ప్రశ్నించారు. తమ కుటుంబాలు గౌరవంగా బ్రతకూడదా.. ఎన్నికల కోసం ఎవరినైనా అవమానించేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ కుటుంబంలో చిచ్చుపెట్టి తన కూతురుకు పదవి ఇస్తానంటాడా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్‎ను భీమవరం, గాజువాక నుంచి ప్రజలు తరిమేశారని, పిఠాపురంలో కూడా తరిమేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. లక్ష పుస్తకాలు చదివేసిన పవన్ కళ్యాణ్ కులాల్లో, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం నేర్చుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‎కి ట్రైనింగ్ ఇచ్చేది ఆయన గురువు చంద్రబాబునాయుడు అని విమర్శించారు. ఎన్నికల తరువాత జనసేన పార్టీ ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..