CM Jagan: ‘నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం’.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు.

CM Jagan: 'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..
Cm Jagan
Follow us

|

Updated on: May 06, 2024 | 1:05 PM

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు. చంద్రబాబును నమ్మడమంటే మళ్లీ మోసపోయి కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని విమర్శించారు. ఐదేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2 లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేశామన్నారు. ఎలాంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా లబ్ది అందించామన్నారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.

నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖల మార్చేశామన్నారు. 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని, 8 నుంచి 10వ తరగతి చదువుతన్న విద్యార్థులకు ట్యాబులు ఇచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల చేతుల్లో ఎప్పుడైనా ట్యాబులు చూశారా అని అడిగారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మేలు అయినా పేదలకు గుర్తుకొస్తుందా అని ప్రజలను అడిగారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రామాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. తాను తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వచ్చే 15 ఏళ్లో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయని, వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పేదరికం మాయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!