Watch Video: శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి షాకైన భక్తులు
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. జనాలు సంచరించే ప్రదేశంలోకి ఎలుగుబంటి రావడమేంటని యాత్రికులు షాక్ అయ్యారు. రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. జనాలు సంచరించే ప్రదేశంలోకి ఎలుగుబంటి రావడమేంటని యాత్రికులు షాక్ అయ్యారు. రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దాని గమ్యానికి చేరుకునేందుకు రోడ్లపై వచ్చే వాహనాలను సైతం లెక్కచేయకుండా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఘాట్ రోడ్లపై కార్లు వెళ్తున్నప్పటికీ ఎలుగుబంటి మాత్రం దానంతట అది రోడ్డుకు అడ్డంగా వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. వేసవికాలం కావడంతో మంచినీరు, ఆహారం కోసం జంతువులు ఇలా రోడ్డు క్రాసింగ్ చేస్తూన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే శ్రీశైలం వచ్చి వెళ్లే భక్తులు, యాత్రికులు, పర్యాటకులు అడవిమార్గంలో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటిని చూసిన యాత్రికులు వారి సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

