Hydra: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం..

హైదరాబాద్‌ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్‌ పెట్టింది. అయ్యప్ప సొసైటీలోని ఓ అక్రమ నిర్మాణ బిల్డింగ్‌ను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించడం ఆసక్తిగా మారుతోంది. మరోవైపు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం హైదరాబాద్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని డిసైడ్‌ అయ్యారు.

Hydra: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం..
Hydra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 05, 2025 | 7:22 AM

అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఫోకస్‌ పెట్టింది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతోంది.. తాజాగా.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్‌ అయ్యారు. అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డును ఆనుకొని 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో.. అయ్యప్ప సొసైటీలో 684 గ‌జాల్లో అక్రమంగా సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల్లో నిర్మిస్తున్న భ‌వ‌నాన్ని పరిశీలించారు. అక్కడిక‌క్కడే జీహెచ్ఎంసీ చందాన‌గ‌ర్ స‌ర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసుల‌తో పాటు హైకోర్టు ఉత్తర్వుల‌పై ఆరా తీశారు.

అక్రమ క‌ట్టడమ‌ని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత‌కు సంబంధించి షోకాజ్ నోటీసు ఇచ్చినా ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ స్పష్టం చేశారు.

ఇక.. అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌ను కూల్చివేస్తున్నట్టు గతేడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత.. గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టు కూడా అక్రమ నిర్మాణ‌మ‌ని నిర్ధారించ‌డ‌మే కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్‌ ఆధారంగా గత జూన్‌లో బిల్డింగ్‌ అక్రమం అని గుర్తించి జీహెచ్ఎంసీ కొంత భాగాన్ని కూల్చివేసింది.

ఇవేవీ ప‌ట్టించుకోకుండా మళ్లీ నిర్మాణాన్ని కొన‌సాగించారంటూ స్థానిక అధికారులు క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. దాంతో.. చర్యలకు సన్నద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు.

ప్రతీ సోమవారం ఫిర్యాదుల స్వీకరణ

మరోవైపు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం హైదరాబాద్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని డిసైడ్‌ అయ్యారు. జనవరి 6వ తేదీ (సోమవారం) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..