AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో బంగారం రూ.50 మాత్రమే..! టన్నుల్లో కూడా కొనుగోలు చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారంలో సమ్మక్క సారలమ్మకు భక్తులు 'బెల్లం బంగారం' రూపంలో మొక్కులు చెల్లిస్తారు. కిలో రూ.50-60కి లభించే ఈ బెల్లంతో పాటు కోళ్లు, మేకలు సమర్పిస్తారు. దేవతలను దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ నిలువెత్తు బంగారపు మొక్కులు సమర్పించడం ఇక్కడి సంప్రదాయం.

కిలో బంగారం రూ.50 మాత్రమే..! టన్నుల్లో కూడా కొనుగోలు చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?
50 Rupee Note
SN Pasha
|

Updated on: Jan 31, 2026 | 7:44 PM

Share

బంగారం కేవలం రూ.60 అనగానే చాలా మంది షాక్‌ అయి ఉంటారు. అయితే ఇది నిజమైన బంగారం కాదు. అంతకంటే విలువైనది. అదే మేడారంలో అమ్మవార్లకు చెల్లించే నిలువెత్తు బంగారం బెల్లం. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరలో భాగంగా భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే క్రమంలో బంగారం (బెల్లం)తో పాటు కోళ్లు, మేకలను బలివ్వడం ఆనవాయితీ.

ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆ వన దేవతలను దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయినా కూడా భక్తల రద్దీ వెంటనే తగ్గిపోతుంది. కాగా ఈ జాతరలో మేకపోతు లైవ్‌ కిలో రూ.900 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు. మటన్‌ ఏకంగా రూ.1500 చెబుతున్నారు. కిలో కోడిని రూ.300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. రూ.350 నుంచి రూ. 400 మధ్య ఉండే కిలో నాటుకోడిని రూ.700లకు అమ్ముతున్నారు. ఇక బంగారంగా పిలిచే బెల్లం కిలో రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. వచ్చినవారిలో ఎక్కువమంది నిలువెత్తు బెల్లంతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దీన్నే బంగారపు మొక్కులు అని పిలుస్తారు. ఎప్పటినుంచో ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి