EMI and Credit Score: బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకున్నవారు ఈఎంఐ ఆలస్యమైతే ఏం జరుగుతుందో ఆందోళన చెందుతారు. ముప్పై రోజులలోపు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై పెద్ద ప్రభావం ఉండదు. కానీ తరచుగా ఆలస్యం చేసి స్పందించకపోతే జరిమానాలు, రికవరీ చర్యలు ఉంటాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడానికి సకాలంలో లేదా 30 రోజులలోపు ఈఎంఐలు చెల్లించడం చాలా ముఖ్యం.