మహిళా సాధికారత, సమానత్వం అనే బరువైన పాయింట్‌ని కామెడీ కోటింగ్ ఇచ్చి చెప్పే ప్రయత్నమే ఈ ఓ శాంతి శాంతి శాంతిః. గోదావరి బ్యాక్ డ్రాప్లో కథ నడవడం, అక్కడి యాస, నేటివిటీ సినిమాకి ఫ్రెష్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల పెంపకంపై ఉండే ఆంక్షలను దర్శకుడు చాలా నేచురల్ గా, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫస్టాఫ్ అంతా పెళ్లి చూపులు, భర్త పెత్తనం, ఆ గొడవలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.