AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Budget 2026-27: హైదరాబాద్‌ అభివృద్ధికి భారీ బడ్జెట్.. ఈ సారి ఎన్ని కోట్లంటే?

హైదరాబాద్‌ అభివృద్దికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సారి బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. నగర అభవృద్దే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్ ముసాయిదాకు కమిటి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ గతేదాడి కంటే ఈ సారి కేటాయింపులు పెరిగినట్టు తెలుస్తోంది.

GHMC Budget 2026-27: హైదరాబాద్‌ అభివృద్ధికి భారీ బడ్జెట్.. ఈ సారి ఎన్ని కోట్లంటే?
Ghmc Budget 2026 27
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 31, 2026 | 7:36 PM

Share

ప్రస్తుత పాలక మండలి కాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో, చివరి సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశంలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఏడాది జీహెచ్‌ఎంసీకి వివిధ ఆదాయ వనరుల నుంచి రూ.6,441 కోట్ల ఆదాయం లభించగా, ఖర్చులు రూ.4,057 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో సంస్థకు రూ.2,384 కోట్ల ఆదాయ మిగులు నమోదైంది. ఇక జీహెచ్‌ఎంసీకి రూ.400 కోట్ల మేర రెవెన్యూ గ్రాంట్లు లభించనున్నాయి. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలకు రూ.1,860 కోట్ల ఆదాయానికి గాను రూ.2,260 కోట్ల కేటాయింపులు చేయగా, అదనంగా రూ.400 కోట్ల మేర నిధులు సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్–తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్‌ 2025 నవంబర్‌ 25న ఆమోదించింది. దీనితో సంబంధించి జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయగా, వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరిగింది. డిసెంబర్‌ చివరి నాటికి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవడంతో, జీహెచ్‌ఎంసీని 12 పరిపాలనా జోన్లు, 60 సర్కిళ్లుగా విభజించారు. దీంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ అవతరించింది.అయితే, ప్రస్తుత పాలక మండలి కాలం ముగిసిన అనంతరం జీహెచ్‌ఎంసీని హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశముందని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.