RRB Group D Jobs: రైల్వేలో 32,000 గ్రూప్ డి ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన

సికింద్రాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రీజియన్లలో దాదాపు 32 వేలకు పైగా ఉన్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇకపై ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరికాదు. ఈ మేరకు విద్యార్హతల్లో కీలక మార్పులు చేస్తూ రైల్వే బోర్డు ప్రకటన జారీ చేసింది..

RRB Group D Jobs: రైల్వేలో 32,000 గ్రూప్ డి ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
RRB Group D Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2025 | 8:16 AM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 32,438 వేలకుపైగా గ్రూప్‌ డి లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 22వ తేదీతో దరఖాస్తులు ముగుస్తాయి. సికింద్రాబాద్‌తో సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

అయితే రైల్వే శాఖలోని ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. టెక్నికల్‌ విభాగాల్లో పోస్టులకు పదో తరగతితోపాటు ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ లేదా లేదా ఐటీఐ డిప్లోమా కోర్సులో తప్పనిసరిగా అర్హత పొంది ఉండాలని తొలుత ప్రకటించింది. దీనిలో మార్పు చేస్తూ తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చొప్పున చెల్లించవల్పి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 ప్రారంభ వేతనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.