AP Constable Physical Events: మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళా అభ్యర్ధులకు దేహదారుఢ్యం పరీక్షలు జనవరి 3 నుంచి ప్రారంభమయ్యాయి. వీటికి హాజరయ్యే అభ్యర్ధులు సంబంధిత ధృవపత్రాలతో హాజరుకావల్సి ఉంటుంది. ఇంతర సందేహాలు ఏవైనా ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు..
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు జనవరి 3 నుంచి గుంటూరు పోలీసు కవాతు మైదానంలో దేహదారుఢ్య, పరుగు పోటీలను ఎస్పీ సతీష్‌కుమార్ ప్రారంభించారు. మూడు రోజులపాటు మహిళలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొదటిరోజు జనవరి 3న 216 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అయితే అందులో 26 మందికి సంబంధిత ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనుతిరగవల్సి వచ్చింది. మహిళా అభ్యర్ధులకు 190 మంది ఎత్తు కొలత, బరువు ఉండాలి. 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంపు తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులు ఫిజికల్ మెజర్‌మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే వర్కింగ్ డేలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 9441450639, 9100203323 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు
జనవరి 6, 7 తేదీల్లో TGPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 పరీక్షలు
తెలంగాణ ఉమెన్ డెవెలప్‌మెంట్ అండ్ చైల్డ్ డెవెలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి జనవరి 6, 7 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీజీపీఎస్సీ సూపర్‌వైజర్ గ్రేడ్-1 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.