AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET PG 2025 Exam Date: సీయూఈటీ పీజీ షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ప్రవేశాలషెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సారి సీయూఈటీ పీజీ 2025 ప్రవేశ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు NTA స్పష్టం చేసింది..

CUET PG 2025 Exam Date: సీయూఈటీ పీజీ షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు
CUET PG 2025
Srilakshmi C
|

Updated on: Jan 05, 2025 | 7:00 AM

Share

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ప్రవేశాలకు తేదీల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. CUET PG 2025 ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి మార్చి 3 నుంచి 31 తేదీ వరకు వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.

మొత్తం 157 సబ్జెక్టుల్లో సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి.సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. కాగా ప్రతీయేట ఈ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సీయూఈటీ పీజీ 2025 పరీక్ష షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ కీ విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ఆర్ఆర్‌బీ టెక్నీషియన్‌ గ్రేడ్-III పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంతోపాటు కీ జనవరి 6వ తేదీన విడుదల చేయనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల అనంతరం దీనిపై అభ్యంతరాలను జనవరి 6 నుంచి 11 వరకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు గత ఏడాది మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 పోస్టులను చేయనున్నారు. అయితే ఈ పోస్టులను భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పోస్టుల సంఖ్య పెరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..