కేంద్ర బడ్జెట్ తయారీలో హల్వా వేడుక కీలక సంప్రదాయం. ఆర్థిక మంత్రి, అధికారుల భాగస్వామ్యంతో జరిగే ఈ వేడుక తర్వాత, బడ్జెట్ టీమ్ 10 రోజుల పాటు నార్త్ బ్లాక్‌లోని ప్రత్యేక భవనంలో కఠిన నిర్బంధంలో ఉంటారు. సెల్ ఫోన్లు కూడా అనుమతించరు. 1950లో బడ్జెట్ లీక్ కావడంతో ఈ పద్ధతి ప్రారంభమైంది, బడ్జెట్ గోప్యతను కాపాడుతుంది.