Watch: బడ్జెట్‌లో ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం
Union Budget: మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్‌లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించేందుకు రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ఆయన కోరారు.
ప్రతియేటా కేంద్ర బడ్జెట్‌కు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు బడ్జెట్‌లో సరైన న్యాయం జరిగేలా.. తగిన నిధులు సాధించేలా బీజేపీ ఎంపీలు పనిచేయాలని కోరారు. మొదటి నుంచీ తెలంగాణపై ప్రధాని మోదీకి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ఈ సారైనా తెలంగాణకు బడ్జెట్‌లో న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. భారత ఫ్యూచర్ సిటీకి సహకరించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్రం సాయం చేయాలని పొన్నం కోరారు.
వైరల్ వీడియోలు
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు

