Indian Railways: రైల్వే ప్రయాణికులకు అద్భుత అవకాశం.. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల సాయం.. ఎవ్వరికీ తెలియని పథకం ఇదే..
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బీమా సౌకర్యం అందిస్తోంది. కేవలం 45 పైసల ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. ఈ మేరకు స్వచ్చంధ బీమా పథకాన్ని రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారత్‌లో రైల్వే ప్రయాణికులు లక్షల సంఖ్యలో ఉంటారు. రోజూ లక్షల మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. దేశ నలుమూలలకు రైల్వే నెట్‌వర్క్ విస్తరించి ఉంది. అయితే రైళ్లల్లో ప్రయాణికుల భద్రతకు రైల్వేశాఖ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రయాణికులను సౌకర్యవంతంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రైలు ప్రమాదాల నివారణకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రక్షణగా బీమా కవరేజీని అందిస్తోంది. కేవలం 45 పైసల ప్రీమియంకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తోంది. రైల్వే టికెటింగ్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ బీమా కవరేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రమాణ బీమా పథకం
ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రైన్లల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు, రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రయాణికులు మరణించడం, క్షతగాత్రులు కావడం లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రైలు ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ స్వచ్చంధ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయ్యి టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ పథకం అమలు చేస్తోంది. కేవలం కన్పార్మ్‌డ్, ఆర్ఏసీ ప్రయాణికులకు మాత్రమే ఈ ఇన్యూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఆప్షన్ బీమా సౌకర్యం. ప్రయాణికులకు అవసరమైతే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎంచుకోవచ్చు. అవసరం లేదనకుంటే వదిలేయవచ్చు.
రూ.10 లక్షల వరకు సాయం
టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కేవలం 45 పైసలు మాత్రమే ప్రీమియం చెల్లించి ఈ బీమా సౌకర్యాన్ని తీసుకోవచ్చు. రైలు ప్రమాదాల సమయంలో బాధితుడు మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఇక శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల ఆర్ధిక సాయం ఇస్తారు. ఇక పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తారు. ఇక మృతదేహాం రవాణాకు అదనంగా రూ.10 వేల సాయం అందిస్తారు. ఈ బీమా పాలసీ కోసం వివిధ ఇన్యూరెన్స్ కంపెనీలతో రైల్వేశాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్యూరెన్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ తర్వాత టికెట్ బుక్ అయిన తర్వాత మీ మొబైల్ లేదా ఈ మెయిల్‌కు బీమా కంపెనీ పాలసీ వివరాలు, నామినీ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు లింక్ పంపిస్తారు. ఆ లింక్‌ను ఉపయోగించి ప్రయాణికులు నామినీ వివరాలు అందించవచ్చు. ఇక అనుమానాలు ఉంటే నేరుగా బీమా కంపెనీని సంప్రదింవచ్చు.
