IND vs NZ 5th T20I: తిరువనంతపురం వేదికగా ఆఖరి సమరం..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగుతున్న సూర్య సేన
IND vs NZ 5th T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ తిరువనంతపురంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తడబడకుండా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

IND vs NZ 5th T20I: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ ఆడుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ ఇది కావడంతో, బ్యాటింగ్‌లో తమ సత్తాను మరోసారి పరీక్షించుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ తిరువనంతపురంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తడబడకుండా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్, నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఖరి పోరులో గెలిచి టీ20 వరల్డ్ కప్ 2026కు ఘనంగా వెళ్లాలని పట్టుదలగా ఉంది.
ఈ మ్యాచ్ కేరళ వాసులకు, ముఖ్యంగా సంజు శాంసన్ అభిమానులకు అత్యంత ప్రత్యేకం. తన సొంత మైదానంలో ఆడుతున్న సంజుపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన సంజు, ఈ మ్యాచ్‌లో రాణించి వరల్డ్ కప్ బెర్త్‌ను పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగించాలని భావిస్తుండగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో 33 పరుగులు చేస్తే టీ20ల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
పిచ్ విషయానికి వస్తే.. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు 200 పైచిలుకు పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం వేళ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సూర్య ధైర్యంగా బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తమ ఫామ్‌ను పరీక్షించుకోనున్నారు. అటు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలనుకున్నామని, భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
