AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మలంతో లక్షల్లో సంపాదన.. దేనికి వాడుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Viral: మలంతో లక్షల్లో సంపాదన.. దేనికి వాడుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jan 31, 2026 | 5:53 PM

Share

కొత్తగా ఆలోచిస్తే డబ్బు సంపాదనకు మార్గాలు అపారం. కెనడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు తన మల నమూనాలను విక్రయించి గతేడాది రూ. 3.4 లక్షలు సంపాదించాడు. సరదాల కోసం కాక, ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వందల మంది ప్రాణాలను కాపాడాడు. ఈ ఫీకల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలో దాత ఎంపిక చాలా కఠినం.

కొత్తగా ఆలోచిస్తే డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలుంటాయి. కెనడాకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు తన మల నమూనాలను విక్రయించి గతేడాది ఏకంగా రూ. 3.4 లక్షలు సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నెలకు సగటున రూ. 28,000 ఆదాయం పొందిన ఈ యువకుడు.. కేవలం డబ్బు కోసమే కాకుండా, ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వందల మంది ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. వైద్య రంగంలో “ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్” (FMT) అనే ప్రక్రియ ద్వారా రోగులకు చికిత్స అందిస్తారు. ఆరోగ్యంగా ఉన్న దాత నుండి సేకరించిన మలాన్ని శుద్ధి చేసి, రోగి పెద్దపేగులోకి ప్రవేశపెట్టడం వల్ల వారి పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్ నయమవుతుంది. గత ఏడాది 149 మల నమూనాలు అందించిన ఈ యువకుడు, ఒక్కో శాంపిల్‌కు రూ. 2,300 చొప్పున అందుకున్నాడు. తన నమూనాలతో 400 మంది రోగులు కోలుకోవడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నాడు. ఈ మల దానం ప్రక్రియ చాలా కఠినమైనదని, దాతగా ఎంపికయ్యే వారి సంఖ్య 1-2 శాతం మాత్రమే ఉంటుందని అతను వెల్లడించాడు.