Big News Big Debate: బటన్ పే చర్చా.. రచ్చా..! రైతు భరోసాపై వైసీపీ వర్సెస్ బీజేపీ.. మధ్యలో టీడీపీ..

మనీ ఎవరిది.. ప్రచారం మరెవరిది.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. పథకాలకు నిధులు మావి.. ప్రచారం మీదా అంటూ YCPపై కాషాయం పార్టీ కస్సుమంటోంది. అయితే కేంద్రసాయంతో పాటు రాష్ట్రం అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం కదా.. అని వైసీపీ రియాక్ట్‌ అవుతోంది.

Big News Big Debate: బటన్ పే చర్చా.. రచ్చా..! రైతు భరోసాపై వైసీపీ వర్సెస్ బీజేపీ.. మధ్యలో టీడీపీ..
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2023 | 9:00 PM

మనీ ఎవరిది.. ప్రచారం మరెవరిది.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. పథకాలకు నిధులు మావి.. ప్రచారం మీదా అంటూ YCPపై కాషాయం పార్టీ కస్సుమంటోంది. అయితే కేంద్రసాయంతో పాటు రాష్ట్రం అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం కదా.. అని వైసీపీ రియాక్ట్‌ అవుతోంది. హౌసింగ్‌ నుంచి రేషన్‌ దాకా రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలకు నిధులన్నీ మావే అంటోంది బీజేపీ. ప్రచారం మాత్రం వైసీపీ చేసుకుంటుందని బీజేపీ నేతలు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకీ ఎవరి బటన్‌ ఎవరు నొక్కుతున్నారు.

నిన్న తెనాలిలో సీఎం విడుదల చేసిన రైతుభరోసా పథకం నిధులపై రాజకీయ దుమారం రేగుతోంది.. రాష్ట్రంలోని 52 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి 11వందల కోట్లు జమ చేశారు సీఎం జగన్‌. దీనిని వైసీపీ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అయితే నిధులు ఇచ్చింది కేంద్రం… విడుదల చేసింది పీఎం అయితే.. ఏపీలో వైసీపీ ప్రచారమేంటని ప్రశ్నిస్తోంది బీజేపీ. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? చేయని పెళ్లికి శుభలేఖలు ఎందుకు? అని ప్రశ్నించారు బీజేపీ నేత సత్యకుమార్‌. ప్రధాని మోడీ నిజమైన బటన్ నొక్కి.. రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు జమ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని మోడీ సర్కారు ఘనతగా పేర్కొంటూ అంతకుముందు ట్వీట్ చేశారు. దీనిని అనుకూలంగా మలుచుకున్న బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు… భరోసా ఒక్కటే కాదు.. మొత్తం 29 పథకాల కింద రాష్ట్రంలోని రైతులకు మోదీ మేలు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ ట్యాగ్‌ చేస్తూ మరీ కామెంట్‌చేశారు.

మరోవైపు ఇచ్చింది గోరంత ప్రచారం పీక్‌ అంటూ టీడీపీ కూడా ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్‌ చేసింది. కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే.. మీరిచ్చిన 90 కోట్లకు ఎందుకంత ప్రచారం అని నిలదీసింది తెలుగుదేశం.

ఇవి కూడా చదవండి

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. మరీ ముఖ్యంగా రైతులకు అండగా ఉండేందుకు రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తోంది. కేంద్ర రాష్ట్ర పథకాలను మెర్జ్‌ చేసి మరీ పథకాలు అమలు చేయడం తప్పు కాదని.. అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుందని చెబుతోంది వైసీపీ. వాస్తవాలనే ప్రజల ముందుంచామని.. ఎలాంటి చర్చకైనా సిద్ధమంటున్నారు మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి.

ఎవరి పథకానికి ఎవరు బటన్‌ నొక్కుతున్నారు.. ఇంతకీ కేంద్రమైనా, రాష్ట్రమైనా సొంత నిధులు ఇస్తున్నాయా? అంతా ప్రజాధనమే అంటున్నారు విశ్లేషకులు. ఎవరు బటన్‌ నొక్కినా చివరకు చేరేది ప్రజల ఖాతాలకే కదా అంటున్నారు. దీనిపై కూడా రాజకీయం అవసరమా అన్నది ప్రశ్న.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..