AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Investment Summit 2023: సరికొత్తగా ముస్తాబైన సాగరతీరం.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు తరలివస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు..

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కి విశాఖ సిద్ధమవుతోంది. ఈసారి కుదిరే ఒప్పందాలన్నీ పక్కాగా అమల్లోకి వస్తాయన్నారు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌. ప్రతిపాదన దశ దాటి DPRలు ఆమోదించిన ఒప్పందాలే ఖరారు చేసుకుంటామంటున్నారు. గురువారం సాయంత్రం విశాఖ చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.

Global Investment Summit 2023: సరికొత్తగా ముస్తాబైన సాగరతీరం.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు తరలివస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు..
Andhra CM Jagan
Sanjay Kasula
| Edited By: |

Updated on: Mar 03, 2023 | 11:44 AM

Share

ఈ నెల 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వేదికలు సిద్ధం చేశారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలు రెడీ అయ్యాయి. ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, పాతిక దేశాల ప్రతినిధులు, మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ రాబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై సెషన్స్ వారీగా ఎక్స్‌పర్ట్స్‌తో చర్చలు ఉంటాయి. మొత్తం పాతిక ప్రత్యేక విమానాల్లో అతిథులు రానుండగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 18 ఫ్లైట్స్‌కు మాత్రమే పార్కింగ్‌కు సరిపడా సౌకర్యాలున్నాయి. మిగతా వాటిని రాజమండ్రిలో పార్కింగ్‌ చేయాలని నిర్ణయించారు.

ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం వంద కోట్లతో విశాఖ నగరాన్ని 100 కోట్లతో సుందరీకరించారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏర్పాట్లపై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున్. విశిష్ట అతిథులకు ఎంజెఎం బీచ్‌ పార్క్‌లో గాలా డిన్నర్‌కు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారాయన. ఆ డిన్నర్‌లో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అమర్నాథ్.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి రాష్ట్రంలో పుష్కలంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ది చెందుతూ ఉంటే అందులో మూడు ఏపీలో ఉన్నాయని గుర్తుచేశారు. పెట్రో కెమికల్ కారిడార్, మారిటైమ్‌ ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం