Andhra Pradesh: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? వారి భేటీ వెనుక సిక్రెట్ అదేనా..
Chandrababu meets JP Nadda: ఒకరెమో కేంద్రంలోని అధికారపార్టీకి జాతీయ అధ్యక్షుడు.. మరొకరు అదే పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు.. ఇంకొకరేమో ఏపీలోని ప్రతిపక్ష పార్టీకి అధినేత.. వెళ్లింది ఒక పని మీద.. కానీ, అక్కడ మరో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. వీరంతా సపరేటుగా భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమ్ముదుమారం రేపుతోంది.

Chandrababu meets JP Nadda: ఒకరెమో కేంద్రంలోని అధికారపార్టీకి జాతీయ అధ్యక్షుడు.. మరొకరు అదే పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు.. ఇంకొకరేమో ఏపీలోని ప్రతిపక్ష పార్టీకి అధినేత.. వెళ్లింది ఒక పని మీద.. కానీ, అక్కడ మరో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. వీరంతా సపరేటుగా భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమ్ముదుమారం రేపుతోంది. ఎన్టీఆర్ 100 స్మారక నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబునాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఉండటం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు వెళ్లింది.. ఒకపని మీద అయితే, అక్కడ మరొకటి చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వీరి కలయిక వెనుక ప్రధాన కారణం.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసమేనా అనే చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీల మధ్య గ్యాప్ మొదలైంది. ఎన్నికల నాటికి అది మరింత ముదిరి ఎవరికి వారే అన్నట్టు తయారయ్యింది. 2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దారుణ ఓటమికి గురికావడంతో కొన్నాళ్ల పాటు వారి బంధం సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత మారిన పరిణామాల దృష్ట్యా ఏపీలో తిరిగి పట్టు సాధించేందుకు అటు బీజేపీ ఇటు జనసేన పార్టీలతో కలిసి నడిచేందుకు చంద్రబాబు ప్లాన్లు వెయ్యడం మొదలెట్టారు. 2024 ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అవి ఒక్కొక్కటిగా అమలు చెయ్యడం స్టార్ట్ చేశారు. జనసేన విషయంలో ఇప్పటికే చంద్రబాబు అవి దాదాపు వర్కౌట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీతో కూడా కలసినడిచేందుకు ప్రయత్నాలు అన్ని రకాలుగా సాగుతూ వస్తున్నాయి. అందులో భాగంగా గతంలోనూ అమిత్ షాను, జేపీ నడ్డాను కలిశారు. ఆ తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య బంధం క్రమంగా బలపడుతున్నట్టు కనిపిస్తూ వచ్చింది. తాజాగా రాష్ట్రపతి భవన్ వేదికగా ఎన్టీఆర్ 100 స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు- జేపీ నడ్డా, పురంధేశ్వరి మధ్య జరిగిన భేటీతో ఇక రెండు పార్టీల మధ్య స్నేహం పూర్తిగా స్థాయిలో చిగురించినట్టేననని.. దాన్ని అధికారికంగా ప్రకటించి చేతులు కలపడమే తరువాయన్న విశ్లేషణలు ఏపీ రాజకీయాల్లో వెల్లువెత్తుతున్నాయి.




మరోవైపు తాజా పరిణామాలపై వైసీపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేసింది. అయితే ఈ ఏటాక్ వెనుక కూడా కారణం లేకపోలేదు. నిజానికి కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా సభతో వైసీపీపై మొదలైన ఎదురుదాడి విశాఖలోని అమిత్ షా సభతో పతాక స్థాయికి చేరింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో అన్ని విషయాల్లోనూ బీజేపీకీ వైసీపీ మద్దతిస్తూ వస్తున్నప్పటికీ ఏపీలో మాత్రం రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత ఈ గొడవ ముదురు పాకాన పడింది. ఓ దశలో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతూ వచ్చారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తన ట్వీట్లో పురంధేశ్వరిని కూడా ప్రధానంగా టార్గెట్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్..
ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది! pic.twitter.com/tdrYPVvIQH
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023
టీవీ9 బిగ్ డిబేట్లోనూ వైసీపీ ఎంపీ భరత్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిల మధ్య ఇదే విషయమై వాడీ వేడీ చర్చ జరిగింది. ఓ దశలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వెళ్తే వైసీపీకి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. మొత్తంగా చూస్తుంటే… ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల పొత్తు విషయంలో మూడు పార్టీలు దాదాపు ఒక క్లారిటీకి వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే. బహుశా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అటు వైసీపీ-ఇటు టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఈ పొత్తు పంచాయతీలు కంటిన్యూ అవుతునే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
