Visakhapatnam: సినీ స్టైల్‌లో చేజింగ్..! దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు..
ఉండేది విజయనగరం జిల్లా.. వృత్తి టూవీలర్ షాపులో ఉద్యోగం.. కానీ వాడి మనసంతా విశాఖ జిల్లా శివాజీ ప్రాంతాలపైనే. రెయ్యిన వస్తాడు.. రెప్పపాటులో మాయమైపోతాడు..! చివరకు.. జనాల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఎందుకో తెలుసా.. విశాఖపట్నంలోని భీమిలి మజ్జివలస గ్రామానికి చెందిన బంగారమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కృష్ణంరాజుపేటలో డ్వాక్రా మీటింగ్ కి వెళ్లి వస్తోంది. ఈ సమయంలో హెల్మెట్ ధరించి ఓ బైక్ పై వచ్చాడు దుండగుడు...

భీమిలి, సెప్టెంబర్ 14: ఉండేది విజయనగరం జిల్లా.. వృత్తి టూవీలర్ షాపులో ఉద్యోగం.. కానీ వాడి మనసంతా విశాఖ జిల్లా శివాజీ ప్రాంతాలపైనే. రెయ్యిన వస్తాడు.. రెప్పపాటులో మాయమైపోతాడు..! చివరకు.. జనాల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఎందుకో తెలుసా.. విశాఖపట్నంలోని భీమిలి మజ్జివలస గ్రామానికి చెందిన బంగారమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కృష్ణంరాజుపేటలో డ్వాక్రా మీటింగ్ కి వెళ్లి వస్తోంది. ఈ సమయంలో హెల్మెట్ ధరించి ఓ బైక్ పై వచ్చాడు దుండగుడు. వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును తెంచుకుపోయాడు. బంగారమ్మ కేకలు వేయడంతో ఓ యువకుడు ఆ దొంగను వెంబడించాడు. సినీ స్టైల్ లో చేజ్ చేశాడు. భయంతో హై స్పీడ్ తో వెళ్తూ అదుపుతప్పి పడిపోయాడు ఆ దొంగ. వాడిని ఆ యువకుడు పట్టుకుని కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
విజయనగరం టు వైజాగ్.. గతంలోనూ..
నిందితుడు విజయనగరం జిల్లా కుమరంకు చెందిన అమిత్ రావుగా గుర్తించారు. ఓ టూ వీలర్ల షాపులో పనిచేస్తున్నాడు. గతంలోనూ కొన్ని నేరాలు చేసినట్టు గుర్తించారు. ఆగస్టు మొదటి వారంలో పద్మనాభంలోనూ దొంగతనం చేసినట్టు గుర్తించారు. ఇంకా వీడు ఎక్కడ చేతివాటం చూపించాడు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పశువుల గడ్డి కోసం గొడవ.. చివరికి ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పశువుల గడ్డికోసం జరిగిన చిన్నపాటి గొడవ చివరికి చిరిగి చిరిగి గాలివానగా మారింది. పొలంలో పశువులను మేపుకొనే విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ గొడవ కాస్తా రెండు వర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందిన రెండా గ్రామంలో ప్రకాశ్ దంగి, ప్రీతం పాల్ అనే వ్యక్తులకు కొన్ని పశువులు ఉన్నాయి. వీరిద్దరికీ పశువుల గడ్డి విషయంలో 3 రోజుల క్రితం గొడవ తలెత్తింది. ఈ గొడవలో ప్రీతం పాల్ అనే వ్యక్తిని ప్రకాశ్ దంగి చెంపదెబ్బ కొట్టాడు. మనస్తాపానికి గురైన ప్రీతం తమ వర్గం వారితో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ప్రకాశ్ దంగి వర్గం వాళ్లు కూడా పోటీగా మరో కేసు పెట్టారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న ఇరువర్గాల వారు మరోమారు గొడవ పడ్డారు. ఆ సమయంలో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




