AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forgot ATM PIN: మీ ఏటిఎం పిన్ నంబర్‌ మర్చిపోయారా.? మరేం పర్వాలేదు క్షణాల్లో ఇలా మళ్లీ పొందొచ్చు..

ఈ రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ లేనివాళ్లు దాదాపు ఎవరూ ఉండరు. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఎం కార్డు కూడా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. సాధారణంగా ప్రతి సారి బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిస్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్తే క్షణాల్లో..

Forgot ATM PIN: మీ ఏటిఎం పిన్ నంబర్‌ మర్చిపోయారా.? మరేం పర్వాలేదు క్షణాల్లో ఇలా మళ్లీ పొందొచ్చు..
Forgot ATM PIN
Srilakshmi C
|

Updated on: Sep 14, 2023 | 8:01 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఈ రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ లేనివాళ్లు దాదాపు ఎవరూ ఉండరు. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఎం కార్డు కూడా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. సాధారణంగా ప్రతి సారి బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిస్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్తే క్షణాల్లో డబ్బు డ్రా చేసుకోవచ్చు.

అయితే ఒక్కోసారి ఏటీఎం పిన్‌ నంబర్‌ మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలో అర్ధంకాక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఇలా ఏటీఎం పిన్‌ మర్చిపోయి ఇబ్బంది పడటం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. దీంతో తప్పు పిన్‌ నంబర్‌ మళ్లీమళ్లీ నమోదు చేయడం వల్ల ఏటీఎం కార్డు 24 గంటలపాటు బ్లాక్‌ అవడం.. ఆ తర్వాత తలలు పట్టుకోవడం మీ అనుభవంలో ఒక్కసారైనా ఇలా జరిగి ఉంటుంది కదా..

ఏటీఎం సెంటర్‌లో సులువుగా ఇలా..

అయితే అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందనవసరం లేదు. పిన్ నెంబర్ మళ్లీ సెట్‌ చేసుకోవచ్చు లేదా పొందవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకోండి..సమీపంలోని ఏటీఎం మెషీన్ లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను పొందవచ్చు. అదెలాగంటే.. ముందుగా మీరు ఏ బ్యాంకు ఏటీఎం వాడుతున్నారో సరిగ్గా అదే ఏటిం వద్దకు వెళ్లాలి. మెషీన్‌లో కార్డు ఇన్‌సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్‌లను గమనించాలి.

ఇవి కూడా చదవండి

వాటిల్లో బ్యాంకింగ్‌పై క్లిక్‌ చెయ్యాలి. తర్వాత ఫర్ గెట్ పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం బ్యాంకు అకౌంట్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ అడుగుతుంది. మీరు దానిని ఎంటర్‌ చేసిన తర్వాత ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఏటీఎం స్ట్రీన్‌పై మెన్షన్‌ చెయ్యాలి. అనంతరం కొత్త ఏటీఎం పిన్‌ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్‌ వస్తుంది. వెంటనే పిన్‌ నంబర్‌ రూపొందించుకుంటే సమస్య తీరిపోయినట్లే..

ఆన్‌లైన్‌లో ఎలా పొందొచ్చంటే..

ఆన్‌లైన్‌లో కూడా ఏటీఎం పిన్‌ నంబర్‌ మార్చుకోవచ్చు. సంబంధిత బ్యాంకు అధికారిక నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం ఏటీఎం కార్డ్‌ ఆప్షన్‌లోకి వెళ్తే.. ఏటీఎం పిన్‌ ఛేంజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసిన తర్వాత ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి అంకెలు, వాలిడిటీ తేదీ, సంవత్సరం వివరాలను నమోదు చెయాలి. అనంతరం బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్‌ చేసిన రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని టైప్ చేసిన తర్వాత కొత్త పిన్‌ నంబర్‌ నమోదు చేసుకుంటే సరి. ఎప్పుడైనా మీ ఏటీఎం పిన్‌ నంబర్ మర్చిపోతే ఇలా క్షణాల్లో మళ్లీ కొత్త పిన్‌ నంబర్ సెట్ చేసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us