తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73)కన్నుమూశారు. బుధవారం (సెప్టెంబర్‌ 13) సాయంత్రం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోన ఉన్న తన నివాసంలో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
Producer Gogineni Prasad
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 14, 2023 | 1:59 PM

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73)కన్నుమూశారు. బుధవారం (సెప్టెంబర్‌ 13) సాయంత్రం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోన ఉన్న తన నివాసంలో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాత గోగినేని ప్రసాద్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కాగా గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక సీనియర్‌ నటీనటులు కైకాల సత్యనారాయణ, కృష్ణా, జమున, విజయ నిర్మల, కళాతపస్వి కె విశ్వనాథ్‌, ఆయన సతీమణి, నందమూరి తారక్‌, శరత్‌బాబు, కృష్ణం రాజు.. ఇలా ఒకరి వెంట ఒకరుగా కానరాని లోకాలకు పయనమయ్యారు. టాలీవుడ్‌ ఈ విషాదాల నుంచి కోలుకోకముందే తాజాగా నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూయడంతో విషాదం నెలకొంది.

నిర్మాత గోగినేని ప్రసాద్ ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’, ‘పల్నాటి పులి’ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ మువీలను నిర్మించారు. తెలుగు టాప్ హీరోలతో ఆయన పలు సినిమాలు తెరకెక్కించారు. వయోభారం కారణంగా ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మరణించారు. గోగినేని ప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికాలో స్థిరపడగా ఆయన నగరంలో తన నివాసంలో ఉంటున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ఇద్దరు తమిళ కమెడియన్స్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ముకేశ్ ఉదేశి సైతం అనారోగ్యంతో మరణించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న ఆయనకు మరికొన్ని రోజుల్లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి ఉంది. కానీ అంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.