AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘మన అమ్మాయి చనిపోతే.. అతనికి నవ్వులాటగా ఉందా..?’.. US పోలీస్ అధికారిపై జగన్ సీరియస్

పకపక నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. నార్మల్ పర్సనే. ఆమెకు 26 ఏళ్లు  ఉంటాయేమో ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు ఇస్తే సరిపోతుంది. విలువ తక్కువే..’ అని నవ్వుతూ వెకిలిగా మాట్లాడాడు. ఈ సంభాషణ అంతా అతడి బాడీ కెమెరాలో రికార్టయ్యింది. సోమవారం సియాటెల్‌ పోలీసులు.. ఈ క్లిప్‌ను బయటకు రిలీజ్ చేశారు. దీనిపై  సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. ఇలాంటి ప్రవర్తనను సహించేదే లేదని స్పష్టం చేసింది. ప్రజంట్ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపింది. 

CM Jagan: 'మన అమ్మాయి చనిపోతే.. అతనికి నవ్వులాటగా ఉందా..?'.. US పోలీస్ అధికారిపై జగన్ సీరియస్
CM Jagan
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2023 | 6:58 PM

Share

జాహ్నవి కందుల.. మన ఏపీలోని  కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అమ్మాయి. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. సియాటెల్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలో చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. 911 పోలీస్‌ వాహనం అతి వేగంతో వచ్చి ఢీకొనడంతో..  100 అడుగులు ఎగిరిపడ్డ జాహ్నవి స్పాట్‌లో మృతి చెందింది. ఆ సమయంలో  911 పోలీస్‌ వాహనాన్ని అతివేగంతో కెవిన్‌ డేవ్‌ అధికారి అతి వేగంతో నడిపారు. ఈ ఏడాది జనవరిలో జరిగిందీ ఘటన. ఆమె లేదన్న బాధను ఇంకా కుటుంబ సభ్యులు జీర్ణించుకోనేలేదు. ఈ లోపే.. అక్కడి పోలీసు ప్రవర్తన గురించి తెలియడంతో వారు మరింత తల్లిడిల్లిపోతున్నారు. జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్‌ అధికారి… చులకన భావంతో మాట్లాడిన వీడియో ప్రజంట్ తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జాహ్నవి డెత్ గురించి తెలిసి దర్యాప్తు చేయడానికి.. అక్కడికి వెళ్లిన  పోలీసు అధికారి డానియెల్‌ అడరర్‌.. పై అధికారికి కేసు వివరాలు చెబుతూ వెకిలిగా ప్రవర్తించారు.

పకపక నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. నార్మల్ పర్సనే. ఆమెకు 26 ఏళ్లు  ఉంటాయేమో ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు ఇస్తే సరిపోతుంది. విలువ తక్కువే..’ అని నవ్వుతూ వెకిలిగా మాట్లాడాడు. ఈ సంభాషణ అంతా అతడి బాడీ కెమెరాలో రికార్టయ్యింది. సోమవారం సియాటెల్‌ పోలీసులు.. ఈ క్లిప్‌ను బయటకు రిలీజ్ చేశారు. దీనిపై  సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. ఇలాంటి ప్రవర్తనను సహించేదే లేదని స్పష్టం చేసింది. ప్రజంట్ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపింది.

పోలీస్ అధికారి ప్రవర్తన కలిచి వేసిందన్న సీఎం జగన్

తాజాగా ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు. మన అమ్మాయి చనిపోతే.. ఆమె జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. అమెరికాలో వెంటనే సంబంధిత అధికారులతో చర్చించాలని.. జాహ్నవి మృతి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు.  ఓ నాన్ అమెరికన్, అందునా అమాయక విద్యార్థిని పట్ల ఆ ఆఫీసర్ అమానవీయ ధోరణిని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరఫున ప్రయత్నాలు ఉండాలన్నారు. ఈ చర్యలు యూస్‌లో ఉన్న ఇండియన్స్  ధైర్యం పెంపొందించేలా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంలో ఎస్.జై శంకర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ అభ్యర్థించారు.

కాగా  తెలుగు విద్యార్ధి కందుల జాహ్నవికి న్యాయం చేయాలని భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. జాహ్నవి యాక్సిడెంట్‌ తరువాత సియాటెల్‌ పోలీసు అధికారి డేనియల్‌ ఆడెరెర్ చేసిన వ్యాఖ్యలపై శాన్‌ఫ్రాన్సిస్కో లోని భారత ఎంబసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది . ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. భారత్‌ అభ్యర్ధనకు అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై తప్పకుండా దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..