- Telugu News Photo Gallery Weight Loss Tips: Do you know that doing housework can also help you lose weight?
Weight Loss Tips: ఇంటి పనులు చేయడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.. అదెలాగో తెలుసుకోండి..
ఒక్క రోజు ఇంటి పనిమనిషి రాకపోవడంతో ఎలా అని తలలు పట్టుకోకండి. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి బట్టలు ఉతకడం, వంట చేయడం వరకు ఇన్ని పనులు ఒంటరిగా ఎలా చేయాలా అని చికాకు పడిపోకడండి. ఇవన్నీ స్వయంగా మీరు చేస్తే కలిగే లాభాలు తెలిస్తే రోజూ పనులన్నీ మీరే చకచకా చేసుకుంటారు.. ఏంటా లాభాలు అనుకుంటున్నారా?
Updated on: Sep 14, 2023 | 8:55 AM

ఒక్క రోజు ఇంటి పనిమనిషి రాకపోవడంతో ఎలా అని తలలు పట్టుకోకండి. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి బట్టలు ఉతకడం, వంట చేయడం వరకు ఇన్ని పనులు ఒంటరిగా ఎలా చేయాలా అని చికాకు పడిపోకడండి. ఇవన్నీ స్వయంగా మీరు చేస్తే కలిగే లాభాలు తెలిస్తే రోజూ పనులన్నీ మీరే చకచకా చేసుకుంటారు.. ఏంటా లాభాలు అనుకుంటున్నారా?

ఈ రోజుల్లో చక్కని శరీరాకృతి కోసం, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఎంతో మంది జిమ్‌కి వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే యోగా, వ్యాయామం చేస్తారు. కానీ ఇంటిపనులు చేయడం వల్ల కూడా కేలరీలు తగ్గి జిమ్ కంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చని చాలా మందికి తెలియదు.

ఇల్లు ఊడ్చడం, నేల తుడుచుకోవడం, గిన్నెలు కడగడం, మెట్లు కడగటం వంటి పనులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంటే జిమ్‌కి వెళ్లకుండా ఇంటిపనులు చేయడం ద్వారా కూడా బరువు అదుపులో ఉంచుకొవచ్చన్నమాట. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఇంటిని గంట పాటు చేస్తే.. అది జిమ్‌లో 20 నిమిషాల వ్యాయామంతో సమానం.

ఇంటిని శుభ్రపరిచే వాక్యూమ్ క్లీనర్ లేదా మాప్‌తో చేస్తే కుదరట. కొంచెం రిస్క్ తీసుకుని మోకాళ్లపై కూర్చొని వంగి శరీరక శ్రమ చెయ్యాలన్నమాట. ఇలా చేయడం వల్ల పొత్తికడుపు కింది భాగంలో ఒత్తిడి పెరిగి నడుము చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

పదేపదే సిట్-అప్‌లు చేయడం వల్ల కీళ్ల ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇంటిని శుభ్రపరిచే అలవాటును రోజువారీ జీవితంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది.