Andhra Pradesh: ఆ జిల్లాలో ఎలుగుబంట్లు స్వైర విహారం.. పలువురుకి గాయాలు.. ఆందోళనలో గామస్తులు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది జీడి, కొబ్బరి తోటల పచ్చదనం. ఇంకా చెప్పాల౦టే అక్కడి ప్రజల కిడ్నీ సమస్యలు. కాని ఇటీవల కాలంలో ఉద్దాన౦ అ౦టే ఎలుగుబంట్లకు కెరాఫ్ అడ్రస్ గాను ముద్రపడుతో౦ది. గత కొన్ని నెలలుగా అదిగో ఎలుగుబంటి అంటే ఇదిగో ఎలుగుబంటి అ౦టున్నారు ఆ ప్రాంత వాసులు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా గ్రామాలలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల మనుషులపైనా, పశువులపైనా యదేచ్ఛగా దాడులకు పాల్పడుతూ పచ్చటి గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

Andhra Pradesh: ఆ జిల్లాలో ఎలుగుబంట్లు  స్వైర విహారం.. పలువురుకి గాయాలు.. ఆందోళనలో గామస్తులు
Bear Hul Chul
Follow us
S Srinivasa Rao

| Edited By: Surya Kala

Updated on: Feb 04, 2024 | 1:36 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో గురువారం రెండు ఎలుగుబంటులు భీభత్సం సృష్టించాయి. మండలంలోని ఎం.గడూరు, డెప్పూరు గ్రామాలలో వరుస దాడులకు పాల్పడ్డాయి. ఎలుగుబంట్లు దాడుల్లో మొత్తం నలుగురు గాయపడగా వారిలో కుమార స్వామి, నారాయణమ్మ అనే ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ లో మొదట పలాస ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా… అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి తరలించారు వైద్యులు. ఎలుగు బంట్లు మొదట ఎం.గడూరు గ్రామంలో కుమారస్వామి అనే మత్స్యకారుడుపై దాడి చేశాయి. కుమారస్వామి సముద్రంలో వేటకు వెళ్ళి ఇంటికి వస్తుండగా తోటలో తిష్ట వేసిన రెండు ఎలుగుబంట్లు ఒక్కసారిగా అతనిపై పడి తీవ్రంగా గాయపరిచాయి. అయితే అదే సమయంలో కుక్కలు వచ్చి అరవటంతో అవి అక్కడ నుండి వెళ్ళిపోయాయి. వెంటనే స్థానికులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ఆ దాడి జరిగిన కాసేపటికే ఆ రెండు ఎలుగుబంట్లు పొరుగునే ఉన్న డెప్పూరు గ్రామంలోని తోటల్లో మళ్ళీ విరుచుకుపడ్డాయి. రేగిపళ్ళు కొస్తుండగా నారాయణమ్మ అనే మహిళపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. సమీపంలోని సుశీల, తాతారావు లపైన దాడి చేశాయి. ఈ దాడిలో నారాయణమ్మ తీవ్రంగా గాయపడింది. ముఖంపై దాడి చేయటంతో కళ్ళు, నుదురు భాగం బాగా దెబ్బతిన్నాయి. ఆమెను పలాస హాస్పిటల్ కి తరలించి అక్కడి నుండి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి తరలించారు. ఆమెకు రెండు కళ్ళు దెబ్బతినగా చికిత్స అనంతరం ఒక కన్ను కొంతమేర మెరుగుపడింది. ప్రస్తుతం నారాయణమ్మ, కుమారస్వామి హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.

మందస మండలం అల్లిమెరక గ్రామంలో హాల్ చల్ చేసిన మూడు ఎలుగుబంట్లు

వజ్రపుకొత్తూరు మండలం ఎం.గడూరు, డెప్పూరు గ్రామాలలో ఎలుగుబంట్లు చేసిన బీభత్సం ఇంకా మరువక ముందే తాజాగా మందస మండలం అల్లిమెరక గ్రామంలో శుక్రవారం ఎలుగుబంట్లు కలకలం రేపాయి. శనివారం ఉదయం అల్లిమెరక గ్రామంలోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హల్చల్ చేశాయి. ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు చేరుకొని ప్రసాదాలు, ఆయిల్ కోసం వెతికాయి. అవేమీ అక్కడ లభించలేదు. ఇంతలో గ్రామస్తులు ఎలుగుబంట్లు గమనించి కేకలు వేయగా ….దానికి తోడు కుక్కలు కూడా వెంటపడటoతో అవి అక్కడ నుండి జారుకున్నాయి. కానీ అవి గ్రామంలోనే ఎక్కడ తిష్ట వేసాయో అన్న అనుమానంతో గ్రామస్తులు మధ్యాహ్నం వరకు వీధుల్లోకి రాడానికి భయపడ్డారు. 2022లో వజ్రపు కొత్తూరు మండలం కిడిసింగి వద్ద తోటలో పనులు చేసుకుంటున్న ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయగా వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇలా ఎప్పటికప్పుడు మనుషులు పైన మూగజావుల పైన దాడులకు పాల్పడుతూ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఎలుగుబట్ల సంచారంతో చివరకు వ్యవసాయ పనులు నిమిత్తం తోటల్లోకి, పొలాల్లోకి వెళ్లాలన్న రైతులు వణికిపోతున్నారు. ఎలుగుబంటులను బంధించి వాటిని జూకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే వన్య సంరక్షణ చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితులలో తప్ప వాటిని బంధించటానికి కుదరదని అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల్లోకి, తోటలలోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాలని గ్రామస్తులకు అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళేటప్పుడు చేతిలో కర్ర విరిగి వంటివి పట్టుకొని వెళ్లాలని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..