Ancient Lemon: యూకేలో జరిగిన వేలంలో నిమ్మకాయ.. లక్షల్లో అమ్మకం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
సాధారణంగా నిమ్మకాయ కాస్ట్ సీజన్ లో ఐదు రూపాయలు ఉంటె.. సాధారణ రోజుల్లో రెండు నుంచి మూడు రూపాయలకు దొరుకుతుంది. అయితే ఇంగ్లాండ్ లో ఓ నిమ్మకాయ ఏకంగా రూ. రూ.1.5 లక్షలకు అమ్ముడైంది. అయితే ఈ నిమ్మకాయ వెరీ వెరీ స్పెషల్ ఏమి కాదు.. పైగా ఇప్పుడు దానిని ఉపయోగించుకోవడానికి కూడా పనికిరాదు.. ఎందుకంటే ఆ నిమ్మకాయ కుళ్లిపోయిన పాత నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎప్పటిదంటే.. సుమారు 285 సంవత్సరాల క్రితంది. దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే..
అరుదైన, చారిత్రాత్మకమైన వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని చూపిస్తారు. అరుదైన వాటిని సొంత చేసుకోవడానికి ఎంత మొత్తంలో ఖరీదు చేయడానికి కూడా వెనుకాడరు. అలా పురాతన కళాఖండాలను, వజ్రాలను మాత్రమే కొనుగోలు చేస్తారనుకుంటే పొరపాటే.. పూర్వకాలం నాటి ప్యాంట్స్ , పర్సులు వంటి వస్తువులను కూడా ఊహించని ధరకు కొనుగోలు చేసేవారున్నారు. అలాంటి వార్తలు నిత్యం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. సాధారణంగా నిమ్మకాయ కాస్ట్ సీజన్ లో ఐదు రూపాయలు ఉంటె.. సాధారణ రోజుల్లో రెండు నుంచి మూడు రూపాయలకు దొరుకుతుంది. అయితే ఇంగ్లాండ్ లో ఓ నిమ్మకాయ ఏకంగా రూ. రూ.1.5 లక్షలకు అమ్ముడైంది. అయితే ఈ నిమ్మకాయ వెరీ వెరీ స్పెషల్ ఏమి కాదు.. పైగా ఇప్పుడు దానిని ఉపయోగించుకోవడానికి కూడా పనికిరాదు.. ఎందుకంటే ఆ నిమ్మకాయ కుళ్లిపోయిన పాత నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎప్పటిదంటే.. సుమారు 285 సంవత్సరాల క్రితంది. దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే..
ఈ కుళ్ళిన నిమ్మకాయ 19వ శతబ్దానికి చెందినది. ఇంగ్లండ్‌కు చెందిన ఒక కుటుంబానికి తమ ఇంట్లో ఉన్న ఒక పాత వస్తువు కనిపించింది. అది ఏమిటా అని పరిశీలిస్తే అది నిమ్మకాయ అని తెలిసింది. అంతేకాదు ఈ నిమ్మకాయకు ఘనమైన చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిది.
నిమ్మకాయ ఎండిపోయి గోధుమ రంగులో కనిపిస్తుంది. దీనిపై ఓ సందేశం కూడా కనిపిస్తుంది. దాని ప్రకారం.. ఈ నిమ్మకాయ 1739 నాటిదని తెలుస్తోంది. ఈ నిమ్మకాయపై “1739 నవంబర్ 3వ తేదీన మిస్టర్ పి లూ ఫ్రాంచినీ మిస్ ఇ బాక్స్ టర్‌కి గిఫ్ట్ గా అందించారని సందేశం ఉంది. అప్పుడు ఆ నిమ్మకాయ తనకు వారసత్వంగా వస్తుందని.. తనఅంకుల్ ది అని తెలుసుకున్న వ్యక్తి ఈ కుళ్లిపోయిన నిమ్మకాయను వేలంలో పెట్టాడు.
View this post on Instagram
బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ యజమాని డేవిడ్ బ్రెట్టెల్ ఈ లెమెన్ ను ఆక్షన్ లో పెడుతూ.. దీనిని ఎవరు కొంటారు… మహా అయితే ఓ పదివేలు వస్తాయేమో అని అనుకున్నాడు. అయితే ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచేలా, జనవరి 31, 2024న ఈ శతాబ్దాల నాటి నిమ్మకాయ $1,780 ( మన దేశ కరెన్సీ లో సుమారు రూ. 1.4 లక్షలు)కి అమ్ముడైంది. ఈ విషయాన్ని బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..